మోడీ కోసం కూడా: మిచెల్లీకి దుస్తులు డిజైన్‌చేసిన భారత డిజైనర్
న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా సతీమణి మిచెల్లీ ఒబామాకు దుస్తులు రూపొందించిన ప్రముఖ డిజైనర్ బిభు మహాపాత్ర భారత ప్రధాని నరేంద్ర మోడీకి కూడా దుస్తులు రూపొందించాలని ఉందని చెప్పారు. బిభు భారత దేశంలో పుట్టి అమెరికాలో ఫ్యాషన్ డిజైనర్‌గా స్థిరపడ్డారు.
బిభు మాట్లాడుతూ.. తాను రూపొందించిన దుస్తులను మిచెల్లీ ఒబామా ధరించడం గొప్ప అనుభూతి అని, అలాగే ప్రధాని మోడీకి కూడా దుస్తులు రూపొందించాలని ఉందని తెలిపారు. ఆ అవకాశం త్వరలో వస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. డిజైనింగ్‌లో మిచెల్లీ అండ్ కో సహకారం మరువలేనిదని చెప్పారు.

కాగా, అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా, ఆయన సతీమణి మిచెల్ ఒబామా ఆదివారం ఢిల్లీకి వచ్చిన విషయం తెలిసిందే. ఒబామా గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ పర్యటనలో మిచెల్ ఒబామా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అలాగే ఆమె ధరించిన దుస్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
న్యూయార్క్‌లో ఉంటున్న భారత సంతతికి చెందిన డిజైనర్ బిభు మహాపాత్ర డిజైన్ చేసిన దుస్తులను ఆమె ధరించారు. జియోమెట్రిక్ - ప్రింట్ బ్లాక్, తెలుపు, నీలం రంగు కలయికతో... ఆకట్టుకునే విధంగా ఈ దుస్తులను రూపొందించారు. సెలబ్రిటీ మహిళలకు దుస్తులు రూపొందించడంలో బిభు మహాపాత్ర పేరుగా గాంచారు.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications