ప్రపంచంలోనే మోడీ ప్రభుత్వం బెస్ట్: తాజా సర్వే ఏం చెబుతోందంటే?
ప్రపంచంలోనే అత్యధికంగా ప్రజల విశ్వాసం పొందిన పాలనను భారతదేశంలోని ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని అందిస్తోందని తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో తేలింది.
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యధికంగా ప్రజల విశ్వాసం పొందిన పాలనను భారతదేశంలోని ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని అందిస్తోందని తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో తేలింది.

మోడీ ప్రపంచంలోనే బెస్ట్
దాదాపు 73శాతం మంది భారతీయులు ప్రధాని మోడీ ప్రభుత్వంపై విశ్వాసం వ్యక్తం చేసినట్లు ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్(ఓఈసీడీ) అనే సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఇది ప్రపంచంలోనే అత్యుత్తమం కావడం విశేషం.

ట్రంప్‌నకు దగ్గన పాస్ మార్కులు
అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంపై కేవలం 30శాతం మంది మాత్రమే విశ్వాసం ఉంచినట్లు ఈ సర్వే తేల్చింది. కాగా, భారత్ తర్వాతి స్థానంలో కెనడా ఉంది. ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రభుత్వంపై 62శాతం మంది కెనడియన్లు విశ్వాసం ఉంచినట్లు సర్వేలో వెల్లడైంది.

మూడో స్థానంలో రష్యా
ఆ తర్వాతి స్థానాల్లో టర్కీ(58శాతం), రష్యా(58శాతం), జర్మనీ(55శాతం) ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ సర్వే ప్రకారం.. బ్రెగ్జిట్ సంక్షోభంతో తీవ్ర సమస్యలు ఎదుర్కొన్న బ్రిటన్ థెరిస్సా మే ప్రభుత్వంపై 41శాతం మంది ప్రజలు విశ్వాసం ఉంచారు. అవినీతి కుంభకోణంలో చిక్కుకున్న దక్షిణకొరియా మాజీ అధ్యక్షురాలు పార్క్ గ్వెన్ హై కారణంగా ఆ దేశ ప్రభుత్వంపై కేవలం 25శాతం మంది ప్రజలు మాత్రమే నమ్మకం వ్యక్తం చేశారు.
ప్రభుత్వంపై ప్రజల విశ్వాసం ఏ మేరకు?
ప్రస్తుత అధికార ప్రభుత్వం స్థిరంగా ఉండగలదో లేదో అనే దాన్ని పరిగణలోకి తీసుకుని ఈ సర్వే నిర్వహించారు. అంతేగాక, అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభుత్వం ప్రజలను రక్షించగలదా? లేదా ప్రజల సేవలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతుందా? అనే అంశాలను కూడా ఈ ఓఈసీడీ సర్వే పరిగణలోకి తీసుకుంది.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications