ముంబై పేలుళ్లతో లఖ్వీకి సంబంధం లేదు: సయీద్, భారత్ ఫైర్
లాహోర్: ముంబై దాడుల కేసు నిందితుడు జకియుర్ రెహమాన్ లఖ్వీ అమాయకుడని నిషేధిత జమాత్-ఉద్-దవా నేత హఫీజ్ సయీద్ అన్నాడు. ఐక్యరాజ్యసమితిని, అమెరికాను అడ్డంపెట్టుకొని భారత్ పాకిస్థాన్‌పై ఒత్తిడి చేస్తోందని ఆరోపించాడు.
లఖ్వీకి వ్యతిరేకంగా భారత్ వద్ద ఎటువంటి ఆధారాలూ లేవని. అనవరసంగా అతడ్ని శిక్షించాల్సిందిగా పాకిస్థాన్‌పై ఒత్తిడి చేస్తోందని సోమవారం ఓ టీవీ చానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో సయీద్ వ్యాఖ్యానించాడు. అలాంటి ఒత్తిడులకు పాక్ లొంగిపోదని ఆయన అన్నారు.

లఖ్వీని విడుదల చేస్తూ లాహోర్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పాకిస్థాన్ ప్రభుత్వం.. దానిపై సత్వర విచారణ చేపట్టాల్సిందిగా కోరింది. కాగా, హఫీజ్ వ్యాఖ్యలను భారత దేశం ఖండించింది. ‘దొంగలు దొంగలకే' మద్దతు ఇస్తారని కేంద్రమంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ వ్యాఖ్యానించారు. దొంగలు సోదరులయ్యారని ఆయన అన్నారు.
నిషిద్ధ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ఉగ్రవాది లఖ్వీ విడుదల వ్యవహారం భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య కొత్త వివాదానికి దారి తీసింది. లఖ్వీ విడుదల అంశంపై భారత్ ఐక్యరాజ్య సమితికి పిర్యాదు చేసింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications