భారత్‍‌లా మనకు సాధ్యం కాదా, అంతా హిల్లరీ వల్లే: ట్రంప్

వాషింగ్టన్: భారత్ అభివృద్ధిలో వేగంగా దూసుకుపోతోందని, అలా మనకు (అమెరికా) ఎందుకు సాధ్యం కాదని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అమెరికాలో ఆర్థిక అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆయన ప్రస్తుత అధ్యక్షులు బరాక్ ఒబామా పైన నిప్పులు చెరిగారు.

ఓ పక్క భారత్, చైనా లాంటి దేశాలు 8 శాతం, 7 శాతం వృద్ధితో దూసుకు పోతున్నాయన్నారు. అమెరికాకు అలా ఎందుకు సాధ్యం కాలేదన్నారు. మాంచెస్టర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ఒక సంవత్సరంలో కనీసం మూడు శాతం వృద్ధి కూడా సాధించలేక పోయారన్నారు.

నన్ను గెలిచినట్లు ప్రకటించండి: మళ్లీ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు

India growing at 8%, why US is not: Trump asks supporters

ఇది ఒక్క బరాక్ ఒబామా పాలనలోనే అన్నారు. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో ఫలితాలు భయానకంగా ఉన్నాయని చెప్పారు. తాను అధికారంలోకి వస్తే నాలుగు శాతం ఆర్థిక వృద్ధి సాధించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అమెరికా ఆర్థికంగా ఉన్నతమైన దేశంగా మళ్లీ అవతరించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

హిల్లరీ క్లింటన్ నిర్ణయాల కారణంగా దేశంలో ఐసిస్ ప్రాబల్యం మరింత పెరుగుతుందన్నారు. ఇప్పటికే కొందరు ఉగ్రవాదులు దేశంలో తిష్టవేశారన్నారు. సిరియా శరణార్థుల విషయంలోను ఆమె నిర్ణయాలు దేశానికి ముప్పు తెచ్చేలా ఉన్నాయన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+