ఏకమైన పాక్,టర్కీ, అమెరికా.. భారత్ హై అలెర్ట్.. రూ. 50 వేల కోట్లతో బిగ్ స్టెప్..?

పహల్గాం ఉగ్రదాడి తర్వాత ప్రపంచంలో పరిస్థితులు చాలా మారిపోయాయి. అప్పటి వరకూ వాణిజ్యంపై టారిఫ్ లు విధించుకుంటూ ఒకరిపైఒకరు నిందించుకుంటూ ఉన్న దేశాలు ఉగ్రదాడి తర్వాత మారిన పరిణామాల నేపథ్యంలో అసలు రంగను బయటపెడుతున్నాయి. మొదట్లో ఉగ్రమూకల అరాచకాన్ని ఖండించిన దేశాలు ఇప్పుడు ఆ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశాలకే వత్తాసు పలుకుతున్నాయి. ఈ క్రమంలో భారత్ అలెర్ట్ అయింది. ఇప్పుడు భారత్ మాత్రమే ఉగ్రవాదంపై పోరాటం చేస్తుందన్న విషయం ప్రపంచానికి అర్థమైంది. అమెరికా లాంటి శక్తివంతమైన దేశం కూడా పాకిస్థాన్ కు సపోర్ట్ ఇస్తున్న నేపథ్యంలో భారత్ ముందున్న సవాల్ ఏంటి..? భారత్ చిరకాల ఫ్రెండ్ రష్యాతో కలిసి ఉగ్రవాదాన్ని ఎదుర్కోగలదా..?

పహల్గాం ఉగ్రదాడి ప్రతీకారంలో భాగంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్రస్థావరాలపై భారత్ దాడులు చేసింది. ఆ స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో దాదాపు 100 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు భారత రక్షణ శాఖ పేర్కొంది. ఆపరేషన్ సిందూర్ లో భాగంగా జైషే మహ్మద్ కీలక ఉగ్రవాది, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ రవూఫ్ అజహర్ హతం అయ్యాడు. రవూఫ్ అజహర్ 1999లో భారత విమానాన్ని హైజాక్ చేసిన విషయం తెలిసిందే.

అయితే భారత్ చేపట్టిన ఆపరేషన్ కు ప్రతిగా పాకిస్థాన్ ఆర్మీ భారత్ పై దాడులు చేసింది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్ సరిహద్దు ప్రాంతాలపై డ్రోన్లతో విరుచుకుపడింది. అయితే వీటిని భారత్ ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొట్టింది. భారత్ కు రష్యా ఇచ్చిన ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థతో పాక్ డ్రోన్లను భారత్ నేలకూల్చింది. అయితే పాకిస్థాన్ కు ఈ డ్రోన్లు సరఫరా చేసింది టర్కీ. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ కు టర్కీ సాయం చేయడంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బాయికాట్ టర్కీ నినాదం ఇప్పుడు భారత్ లో ట్రెండింగ్ లోకి వచ్చింది. టర్కీకి పలు వాణిజ్య సేవలను నిలిపివేస్తున్నట్లు భారత్ ప్రకటించింది. త్వరలోనే మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే యోచనలో భారత్ ఉంది.

ఇప్పుడు పాకిస్థాన్, టర్కీలు ఒక్కటైన నేపథ్యంలో వాటికి తోడుగా అమెరికా రావడం ఆందోళన కలిగించే విషయం. పైకి ట్రంప్ ఉగ్రవాదంపై వ్యతిరేకత వ్యక్తం చేసినా.. భారత్ కు మాత్రం వెన్నుపోటు పొడిచినట్లు తెలుస్తోంది. భారత్- పాకిస్థాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ అవగాహన తన ఎంట్రీతోనే సాధ్యం అయిందని ట్రంప్ చెప్పుకుంటున్నారు. తన దృష్టిలో ఇరు దేశాలు ఒకటేనని అన్నారు. ఇరు దేశాల అధినేతలతో తనకు సత్సంబంధాలు ఉన్నట్లు పేర్కొన్నారు.

అంతేకాక భారత్ పైన తన వైఖరిని మరోసారి ప్రదర్శించారు ట్రంప్. యాపిల్ సంస్థ సీఈఓ టిమ్ కుక్ ను భారత్ లో పెట్టుబడులు పెట్టకుండా కాలు అడ్డం పెట్టారు. దీంతో ట్రంప్ వైఖరిపై భారత్ లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే తాజాగా అమెరికా.. టర్కీకి భారీ సాయం చేసింది. 225 మిలియన్ డాలర్ల విలువైన AMRAAM మిస్సైల్స్ ను టర్కీకి ఇచ్చేందుకు అమెరికా సిద్ధమైంది. అంతేకాక 79.1 మిలియన్ డాలర్ల 60 బ్లాక్- 2 క్షిపణులను కూడా టర్కీకి అందించనుంది అమెరికా. ఇదే క్రమంలో పాకిస్థాన్ కు అన్నివైపులా టర్కీ అండగా నిలుస్తోంది. ఇప్పటికే పాక్ కు పెద్ద ఎత్తున డ్రోన్లు సరఫరా చేసింది టర్కీ. ఆయుధాలతో పాటు ఆర్మీని కూడా పంపింది టర్కీ. ఇప్పుడు అమెరికా ఇచ్చే ఆయుధాలను కూడా సరఫరా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మూడు దేశాలు ఒక్కటయ్యాయని చెప్పొచ్చు. ఇక పాకిస్థాన్ కు చైనా అండ ఎలాగో ఉంది.

India on Alert Amid Global Tensions Centre Plans 50 000 Crore Defence Budget Hike

ఈ క్రమంలో భారత్ అలెర్ట్ అయింది. రక్షణశాఖ బడ్జెట్‌ను రూ.50 వేల కోట్ల పెంపునకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది రక్షణశాఖ కేటాయింపులు రూ.6.81 లక్షల కోట్లు కాగా.. తాజాగా పెంపునకు పార్లమెంట్ వింటర్ సమావేశాల్లో ఆమోదం లభించే అవకాశాలున్నాయి. దాంతో డిఫెన్స్‌కు కేటాయించిన నిధులు రూ.7 లక్షల కోట్ల మార్కును దాటనున్నట్లు సమాచారం.

ఇక భారత్ చిరకాల మిత్రుడు రష్యాతో మరోసారి బిగ్ డీల్ చేసుకోనున్నట్లు సమాచారం. పాక్ దాడుల్ని తిప్పికొట్టిన ఎస్-400 కంటే శక్తిమంతమైన ఎస్-500 గగనతల రక్షణ వ్యవస్థను రష్యా నుంచి భారత్ కొనుగోలు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ఎస్-400 కు మించిన సామర్థ్యం గల ఎస్-500 క్షిపణిని రష్యా.. భారత్ కు ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. దేశీయంగా వీటిని తయారు చేద్దామని ఇరు దేశాలు అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం.

ఎస్-400 కంటే ఎక్కువ సామర్థ్యంతో ఎస్-500ను రూపొందించింది రష్యా. ఫైటర్‌ జెట్స్, క్రూయిజ్ మిసైల్స్, హైపర్‌ సోనిక్ మిసైల్స్, శత్రుదేశ నిఘా శాటిలైట్స్‌ ను కూడా ఎస్-500 వ్యవస్థ చిత్తు చేయగలదు. భూ ఉపరితలం నుంచి 200 కిలోమీటర్ల పైన ఉన్న టార్గెట్స్‌ ను నాశనం చేయగలిగే సామర్థ్యం ఉంది. మొత్తం 600 కిలోమీటర్ల పరిధిలోని శత్రుదేశ మిసైల్స్ ను కూడా ఎస్-500 వ్యవస్థ కూల్చేయగలదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+