పని చేసేందుకు ఆసక్తి: 18వ స్థానంలో భారత్, పాక్‌లో..
న్యూఢిల్లీ: పని చేయడానికి ఎక్కువ మంది కోరుకునే దేశాల్లో భారత్ 18వ స్థానంలో ఉంది. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు, టోటల్ జాబ్స్.కామ్, ది నెట్ వర్క్‌లు సంయుక్తంగా ఓ సర్వే చేశాయి. సర్వే జాబితాను విడుదల చేశాయి. సర్వేలో పాల్గొన్న 70-80 శాతం మంది భారతీయులు బయట పని చేయడానికి సిద్ధంగా ఉండటం గమనార్హమని నివేదిక చెబుతోంది. జాబితాలో అమెరికాకు అగ్రస్థానం దక్కింది.
రెండో స్థానంలో బ్రిటన్, మూడో స్థానంలో కెనడా, నాలుగో స్థానంలో జర్మనీ, ఐదో స్థానంలో స్విట్జర్లాండులు ఉన్నాయి. ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, స్పెయిన్, ఇటలీ, స్వీడన్‌లు ఆ తర్వాత వరుసగా ఉన్నాయి. భారతదేశం మాత్రం 18వ స్థానంలో నిలిచింది.

అమెరికా, ఐరాపాలతో పోలిస్తే ఆసియా పసిఫిక్ ప్రాంతం పని చేయానికి ఆసక్తిని పురికొల్పడం లేదని తేలింది. ఆయా ప్రాంతాల్లోనే వివిధ భాషల సమ్మెళనమే అందుకు కారణమని, అయితే కొన్ని ఆసియా దేశాలు మాత్రం తాము పొగొట్టుకున్న సిబ్బందిని తిరిగి రప్పించుకోవడానికి పనులు మొదలు పెట్టాయి.
అంతర్జాతీయంగా ప్రతి అయిదు మందిలో ఒకరికి అంతర్జాతీయ పని అనుభవం ఉంది. 97 శాతం మంది పాకిస్తానీయులు బయట దేశంలో పని చేసేందుకే సుముఖత చూపుతున్నారు. నెదర్లాండ్స్‌లో 94 శాతం మంది ఇతర దేశాల వైపు ఆసక్తి చూపుతున్నారు. అమెరికా, జర్మనీ, బ్రిటన్ దేశాల వారు మాత్రం స్వదేశం వైపే చూస్తున్నారు.












Click it and Unblock the Notifications