చేయి చేసుకున్న భారత హై కమిషనర్ భార్య, రీకాల్
న్యూఢిల్లీ: భార్య సిబ్బందిపై దాడి చేసిందన్న ఆరోపణలు రావడంతో న్యూజిలాండ్ భారత హైకమిషనర్‌ను స్వదేశానికి రీకాల్ చేయించింది. న్యూజిలాండ్‌లో భారత హై కమిషనర్ రవి థాపర్ భార్య షర్మిల ఇంట్లో పనిచేసే షెఫ్‌పై చేయి చేసుకుంది.
దీంతో భారత హై కమిషనర్ రవి థాపర్ ఇంటి నుంచి గత నెలలో ఓ రాత్రి షెప్ 20 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లిపోయాడు. అక్కడ అపస్మారక స్ధితిలో స్ధానికులకు కనిపించాడు. దీంతో అతడిని సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

చికిత్స అనంతరం తేరుకున్న అతను, రవి థాఫర్ భార్య షర్మిల తనను వేధింపులకు గురి చేశారని, హింసించేవారిని చెఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించి స్ధానిక పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై న్యూజిలాండ్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించారు.
ఈ ఘటనపై విచారణకు ఆదేశించిన భారత విదేశీ వ్యవహారాల శాఖ రవి థాపర్‌ను రీకాల్ చేసింది. అంతేకాదు షర్మిల దాడి చేసిన ఘటనపై విచారణ చేయడానికి ఓ బృందాన్ని న్యూజిలాండ్‌కు పంపింది. విచారణ నివేదికను బట్టి రవి థాపర్ పై చర్యలు తీసుకుంటామని భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ చెప్పారు.












Click it and Unblock the Notifications