ఎవరి ఖాతాలో ఎంత: ప్రభుత్వం చెంతకు భారతీయుల స్విస్ బ్యాంక్ అకౌంట్ వివరాలు
స్విస్ బ్యాంకుల్లో భారతీయులు నిర్వహిస్తున్న ఖాతాలకు సంబంధించిన పూర్తి వివరాలు భారత్‌కు అందాయని స్విట్జర్లాండ్ ప్రభుత్వం వెల్లడించింది. ఇరు దేశాల మధ్య ఉన్న ఆటోమేటిక్ ఇన్ఫో ఎక్స్‌ఛేంజ్ ఫ్రేమ్ వర్క్ ఒప్పందంను అనుసరించి భారతీయుల స్విస్ బ్యాంక్ ఖాతాల వివరాలను భారత ప్రభుత్వంకు అందజేసినట్లు స్విట్జర్లాండ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. నల్లధనం పై యుద్ధం ప్రారంభించిన భారత ప్రభుత్వం స్విస్ ఖాతాల వివరాలు అందజేయాలని స్విట్జర్లాండ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఇప్పటి వరకు స్విస్ బ్యాంకుల్లో యాక్టివ్‌గా ఉన్న ఖాతాలతో పాటు 2018లో ఖాతాలను మూసివేసిన వారి వివరాలు కూడా స్విట్జర్లాండ్ ప్రభుత్వం భారత్‌కు అందజేసింది. ఇక మరో జాబితాను వచ్చే ఏడాది 2020 నాటికి వెల్లడిస్తుంది. ఇక పూర్తి వివరాలు భారత ట్యాక్ డిపార్ట్‌మెంట్‌కు అందజేసిన స్టిట్జర్లాండ్ ఫెడరల్ ట్యాక్స్ ఆఫీస్... వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచింది. 2016లో భారత్ స్విట్జర్లాండ్ దేశాలు స్విస్ బ్యాంకుల్లోని భారతీయుల ఖాతాలకు సంబంధించి పరస్పర సమాచారం మార్చుకునే ఒప్పందంపై సంతకాలు చేసుకున్నాయి. ఇది జనవరి 2018 నుంచి అమల్లోకి వచ్చింది.

కామన్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్‌ను మెయింటెయిన్ చేస్తూ స్విస్ బ్యాంకు ఖాతాదారుల వివరాలను స్విట్జర్లాండ్ ప్రభుత్వం భారత్‌కు అప్పగించింది. సీఆర్ఎస్ రహస్య నిబంధనల ఉల్లంఘనలు కాకుండా, డేటా పరిరక్షణపై దృష్టి సారిస్తుంది. దీన్ని ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ సంస్థ రూపొందించింది. భారత ప్రభుత్వం ఇలా సమాచార సహకార ఒప్పందం మరో 75దేశాలతో కుదుర్చుకున్నట్లు స్విస్ సంస్థలు తెలిపాయి. గతేడాది 36 దేశాలు ఆటోమేటిక్ ఎక్స్‌ఛేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనుసరించాయని ఏజెన్సీలు తెలిపాయి.
భారతదేశంలోనే కాకుండా స్విస్ బ్యాంకుల్లో తమ సంపాదన ఎంత దాచుకున్నారనేది వెలుగులోకి వస్తుంది. ఇప్పటి వరకు స్విస్ బ్యాంకు ఖాతాల వివరాలు ఎప్పుడూ బహిర్గతం కాలేదు. జనవరి 2018లో ఏఈఓఐ ఒప్పందం తర్వాతే ఈ వివరాలను స్విట్జర్లాండ్ ప్రభుత్వం భారత్‌కు అప్పగించింది. స్విస్ నేషనల్ బ్యాంకు 2018 ఇచ్చిన సమాచారం మేరకు భారతీయుల స్విస్ ఖాతాల్లో వరుసగా మూడేళ్లు పాటు సంపద తగ్గిన తర్వాత ఒక్కసారిగా వారి ఖాతాల్లో 50శాతం సంపద పెరిగినట్లు తెలుస్తోంది.
-
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
అప్పటి వరకూ పాకిస్థాన్ కు నో వాటర్: భారత్ సంచలనం -
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
ఏసీ గదుల్లో ఎక్కువగా ఉంటున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications