వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అద్భుతాన్ని ఆవిష్కరించిన ఆస్ట్రోశాట్: 9.3 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అంతరిక్ష ప్రయోగాల్లో ఇప్పటికే ఆరితేరిన భారత్.. మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. భారత్ ప్రయోగించిన ఆస్ట్రోశాట్.. ఓ పాలపుంత నుంచి వెలువడిన ఓ సరికొత్త కాంతిపుంజాన్ని గుర్తించింది. భూమికి 9.3 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉందా గెలాక్సీ. అక్కడి నుంచి ప్రసరించిన అతినీల లోహిత కిరణాలు భూమిపైకి ప్రసరించడాన్ని కనుగొన్నది. అంతరిక్షంలో సుదీర్ఘ సమయం పాటు అత్యంత ప్రకాశవంతంగా, కాంతివంతంగా ఉండే అల్ట్రా వయోలెట్ కిరణాలవి. అవి ఎలా పుట్టుకొచ్చాయనే విషయంపై శాస్త్రవేత్తలు పరిశోధన సాగిస్తున్నారు.

ఈ కిరణాలకు ఏయూడీఎఫ్ఎస్01 అని నామకరణం చేసినట్లు పుణెలోని ఇంటర్ యూనివర్శిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్‌ ప్రొఫెసర్ డాక్టర్ కనక్ సాహా తెలిపారు. భారత్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, యూఎస్ఏ, జపాన్, నెదర్లాండ్‌కు చెందిన అంతరిక్ష పరిశోధకులతో కూడిన బృందానికి ఆయన సారథ్యాన్ని వహిస్తున్నారు. ఓ పాలపుంత నుంచి ఇలాంటి కిరణాలు వెలువడటం, అల్ట్రా వయోలెట్ ఎన్విరాన్‌మెంట్‌లో గెలాక్సీ ఏర్పడటం ఇదే తొలిసారిగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అత్యాధునికమైన హాబుల్ ఎక్స్‌ట్రీమ్ డీప్ ఫీల్డ్ ద్వారా తాము దీన్ని గుర్తించామని, ఈ కాంతిపుంజానికి సంబంధించిన డేటాలను ఆస్ట్రోశాట్ విశ్లేషిస్తోందని చెబుతున్నారు.

Indias AstroSat telescope discovers a galaxy called AUDFs01

2016 అక్టోబర్‌లో సుమారు 28 గంటల పాటు దీనికి సంబంధించిన వివరాలపై అధ్యయనం చేసినట్లు అంచనా వేస్తున్నారు. అతినీల లోహిత కిరణాల ప్రయాణాన్ని పసిగట్ట గల స్పేస్ టెలిస్కోప్ ఇదొక్కటే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ అల్ట్రా వయోలెట్ కిరణాలు ఎలా జన్మించాయనే విషయంపై పరిశోధనలను నిర్వహిస్తున్నామని, అది ఎలా పుట్టుకొచ్చిందనే విషయాన్ని గుట్టు విప్పడం అనేక ప్రశ్నలకు సమాధానం లభిస్తుందని భావిస్తున్నట్లు ఐయూసీఏఏ డైరెక్టర్ డాక్టర్ సోమక్ రాయ్ చౌదరి తెలిపారు. ఆస్ట్రోశాట్ కంటే పెద్దదైన హబుల్ టెలిస్కోప్ సైతం ఇలాంటి కాంతిపుంజాన్ని గుర్తించలేదని సోమక్ రాయ్ తెలిపారు.

Indias AstroSat telescope discovers a galaxy called AUDFs01

Recommended Video

Russia's Covid-19 Vaccine : How Can We Trust సైడ్ ఎఫెక్ట్స్ చూడకుండా ప్రజలపై ప్రయోగాలా ? Scientists

సుదీర్ఘకాలం పాటు సాగుతోన్న కొన్ని రహస్యాలను ఛేదించడానికి వీలు ఉంటుందని అన్నారు. బిగ్‌బ్యాంగ్ అనంతరం అయిదు వేలకు పైగా చిన్న, పెద్ద పాలపుంతలో ఏర్పడ్డాయని, వాటిల్లోనూ ఇదే తరహా అల్ట్రా వయోలెట్ కిరణాల పుట్టుకొచ్చినట్లు ఆధారాలు లేవని తెలిపారు. తాజాగా 9.3 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ పాలపుంతను యంగెస్ట్ గెలాక్సీగా భావిస్తున్నారు శాస్త్రవేత్తలు. బిగ్‌బ్యాంగ్ తరువాత 450 మిలియన్ సంవత్సరాల వ్యవధిలో ఇది ఆవిర్భవించి ఉండొచ్చని చెబుతున్నారు. ఆస్ట్రోశాట్ గుర్తించిన ఈ కాంతి వల్ల తమ పరిశోధనలకు మరింత ఆధారం లభించినట్లు అంచనా వేస్తున్నారు.

English summary
India’s multi-wavelength orbiting telescope, AstroSat, has discovered a galaxy called AUDFs01 in the extreme-ultraviolet (UV) light spectrum. The galaxy is 9.3 billion light-years away from Earth.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X