పాక్‌కు షాక్: భారత్‌కు చైనా మద్దతు, దాయాదికి అమెరికా సాయం
బీజింగ్: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం విషయమై ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హామీ ఇచ్చారు. తాజాగా చైనా కూడా మద్దతిచ్చేందుకు సిద్ధమని చెప్పింది. భారత్ శాశ్వత సభ్యత్వం కోసం రష్యా ఇప్పటికే మద్దతుదారు.
కాగా తాజాగా సోమవారం చైనాలో జరిగిన రష్యా, ఇండియా, చైనా (ఆర్‌ఐసీ) విదేశాంగ మంత్రుల సమావేశంలో దానిని రష్యా పునరుద్ఘాటించింది. కాగా చైనా మాత్రం భారత్‌కు ఐక్యరాజ్య సమితిలో మరింత విస్తృతమైన పాత్ర ఉండాలని కోరింది. గతంలో భారత్‌కు శాశ్వత సభ్యత్వానికి మద్దతు ఇవ్వని చైనా ఇప్పుడు అనుకూలంగా మాట్లాడడం మద్దతు ఇవ్వడానికి దగ్గరగా జరిగినట్లేనని తెలుస్తోంది.
ఈ మద్దతుతో పాటు 19 ఏళ్లుగా ఐక్యరాజ్య సమితిలో మూలన పడిన ఉగ్రవాద నిర్మూలనపై పూర్తి స్థాయి చర్యలకు రష్యా, చైనాలు మద్దతు పలికాయి. దీంతో ఐక్యరాజ్య సమితిలో ఉగ్రవాదంపై చర్యలు తీసుకునేలా భారత్, చైనా, రష్యాలు చర్చలు మొదలుపెడతాయి.

పాకిస్థాన్‌లో ఉగ్రవాద మూలాలను తుడిచిపెట్టడానికి ఇది ఒక ముందడుగుగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కూడా 19 ఏళ్లుగా మూలన పడిన ఒక తీర్మానానికి నేడు మద్దతు లభించినందుకు సంతోషంగా ఉందని చెప్పారు. భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వానికి మద్దతు పలుకుతామని ఒబామా ఇటీవల హామీ ఇచ్చినప్పుడు పాకిస్తాన్ దానిని వ్యతిరేకించింది. ఇప్పుడు చైనా కూడా దగ్గరకు వస్తుండటం పాక్‌కు షాకని చెప్పొచ్చు.
పాక్‌కు అమెరికా సాయం 6170 కోట్లు
పాకిస్థాన్‌కు రూ.6170 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించాలని నిర్ణయించినట్లు బరాక్ ఒబామా మంగళవారం పేర్కొన్నారు. ఫారిన్ మిలటరీ ఫైనాన్సింగ్ (ఎఫ్‌ఎంఎఫ్)లో భాగంగా ఈ మొత్తాన్ని పాక్‌కు ఇవ్వడానికి ప్రతిపాదనలు రూపొందించారు. ఉగ్రవాదంపై సమర్థ పోరుకు సైన్యాన్ని బలోపేతం చేయడం, అణ్వాయుధాల భద్రత, అఫ్గనిస్థాన్‌లో స్థిరత్వం, భారత్‌తో ఆర్థిక సంబంధాల బలోపేతం మొదలైన వాటికోసం ఈ నిధులను వెచ్చించాల్సి ఉంటుంది.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications