వీరత్వం అక్కడే: భారత్‌పై అజర్ వెక్కిరింత

న్యూఢిల్లీ: భారత్‌పై పాకిస్తాన్ భూభాగం నుంచి భారత్‌ను లక్ష్యం చేసుకుంటున్న జైష్- ఎ- మొహమ్మద్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. భారత్ పట్ల తన ద్వేషాన్ని వెళ్లగక్కింది. యురి భారత సైనిక స్థావరంపై పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు పెరుగుతున్న నేపథ్యంలో జైష్ - ఎద మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ తన ద్వేషాన్ని చాటుకున్నాడు.

భారత సైన్యం, రాజకీయ నాయకత్వంపై వ్యంగ్యాస్త్రాలు అతను వ్యంగ్యాస్త్రాలు విసిరాడు. పాకిస్థాన్ శిబిరాలపైన, జీహాదీలపైన భారత్ దాడులు చేసినట్టు చూపించడం కేవలం బాలీవుడ్ సినిమాలకే పరిమితమని ఆయన అన్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో పఠాన్‌కోట్‌, ఈనెల 18న ఉరీ ఉగ్ర ఘటనలు పాక్ ప్రేరేపిత జైషే మొహమ్మద్ ఉగ్రవాదుల పనేనంటూ భారత్ ఇప్పటికే ప్రకటించింది.

ఆయన మాట్లాడిన ఆడియోను ఆ సంస్థ ఆన్‌లైన్ మౌత్‌పీస్ 'రంగొనూర్'లో జైషే విడుదల చేసింది. భారతీయుల శూరత్వం బాలీవుడ్ చిత్రాలకే పరిమితమని ఆ ఆడియోలో మసూద్ అజహర్ వ్యాఖ్యానించాడు. ఉర్దూ స్క్రిప్టులో ఉన్న ఆడియోను ఈనెల 19న రంగొనూర్ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేశారు.

India's heroism is restricted to B'wood films: JeM chief Masood Azhar

'ది రియల్ పౌంటెన్‌హెడ్ ఆఫ్ పవర్' అనే టైటిల్‌తో 9.41 నిమిషాల నిడివిగల న్యూస్ బులిటెన్‌లో అజహర్ - 'భారత్‌ బాలీవుడ్ సినిమాల్లోని హీరోలు ‌తమ నీడను చూసి తామే భయపడుతుంటారని, భారత్‌ను తిరుగులేని శక్తిగా. పాక్‌ను బలీయమైన దేశంగా చిత్రీకరిస్తుంటారని అన్నాడు.

ఆ హీరోల ఒంటినిండా ఉత్త గ్యాసే ఉంటుందని, సినిమాల్లో మాత్రం పాకిస్థాన్‌పై దాడి చేసినట్టు, క్యాంపులు ధ్వంసం చేసి ముజాహిదీన్లను పట్టుకున్నట్టు చిత్రీకరిస్తుంటారని అన్నాడు. ఒక్క బుల్లెట్ కూడా ఆ హీరోలకు తగలదని, వాళ్లు మాత్రం ముజాహిదీన్లపై తూటాల వర్షం కురిపించేస్తుంటారని అజహర్ ఎద్దేవా చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+