India-Bangladesh: బంగ్లాదేశ్ పట్ల భారత్ దాతృత్వం.. రెండు ఓడల్లో 16 వేల టన్నుల బియ్యం

India-Bangladesh: ఎన్ని ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ భారత్ బంగ్లాదేశ్ పట్ల దాతృత్వాన్ని చూపింది. బంగ్లాదేశ్ కు సముద్రం ద్వారా 16,400 టన్నుల బియ్యాన్ని పంపింది. శనివారం ఉదయం బియ్యాన్ని మోసుకెళ్లిన రెండు నౌకలు బంగ్లాదేశ్ ఓడరేవుకు చేరుకున్నాయి. భారత్ నుంచి బియ్యం కొనుగోలు చేయడానికి బంగ్లాదేశ్ ఒక ఒప్పందం చేసింది. ఈ ఒప్పందం ప్రకారం భారత్ బంగ్లాదేశ్ కు 3 లక్షల టన్నుల బియ్యం ఇవ్వాలి. ఇందులో 40 శాతం మోంగ్లా పోర్టుకు, మిగిలినది చిట్టగాంగ్ పోర్టుకు పంపేలా ఒప్పందం జరిగింది. శనివారం 16, 400 టన్నుల బియ్యం మోంగ్లా ఓడరేవుకు చేరుకోగా.. అక్కడ బంగ్లాదేశ్ అధికారులు స్వీకరించారు. రెండు దేశాల మధ్య సంబంధాలు అనేక అంశాలపై ఉద్రిక్తంగా ఉన్న సమయంలో బంగ్లాదేశ్ ఈ బియ్యాన్ని అందుకోవడం గమనార్హం.

పనామా జెండాతో కూడిన ఓడ "బీఎంసీ ఆల్ఫా" ఒడిశాలోని ధమ్రా ఓడరేవు నుంచి 7,700 టన్నుల బియ్యంతో వచ్చిందని.. థాయిలాండ్ జెండాతో కూడిన "ఎంవీ సీ ఫారెస్ట్" కోల్‌కతా ఓడరేవు నుంచి 8,700 టన్నుల బియ్యంతో బంగ్లాదేశ్ కు చేరుకుందని మోంగ్లా ఫుడ్ కంట్రోలర్ కార్యాలయం తెలిపింది. ఈ ఒప్పందంలో భాగంగా బంగ్లాదేశ్ కు భారత్ నుంచి మొదటి సారి బియ్యం సరఫరా జనవరి 20న జరిగింది.

India Sends 16 400 Tons of Rice to Bangladesh Amid Tensions

వాణిజ్య ఒప్పందాలపై ప్రభావం లేదు..

గతేడాది ఆగస్టులో షేక్ హసీనాను అధికారం నుంచి తొలగించినప్పటి నుంచి భారత్-బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అయినప్పటికీ రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు కొనసాగుతున్నాయి. అయితే కొన్ని రోజుల క్రితం మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఫిబ్రవరిలో రెండు దేశాల బోర్డర్ గార్డ్స్ డైరెక్టర్ జనరల్స్ సమావేశంలో ఇండియాలోని కొన్ని సరిహద్దు ఒప్పందాలను రద్దు చేయడానికి ప్రయత్నిస్తామని చెప్పింది. ఇప్పటివరకు దాని ప్రభావం వాణిజ్య ఒప్పందాలపై లేదు.

నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ గతేడాది ఆగస్టులో బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారు. షేక్ హసీనా దేశం విడిచి పారిపోయి ఢాకా నుంచి వెళ్లాల్సి వచ్చింది. 77 ఏళ్ల హసీనా గత ఏడాది ఆగస్టు 5 నుంచి భారతదేశంలో నివసిస్తున్నారు. దీంతో హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ 16 ఏళ్ల పాలనకు తెరపడింది. బంగ్లాదేశ్ కు చెందిన అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ICT) షేక్ హసీనాపై అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. హత్య సహా అనేక తీవ్రమైన కేసుల్లో ఆమెపై కేసులు నమోదయ్యాయి. హసీనాను అప్పగించాలని డిమాండ్ చేస్తూ బంగ్లాదేశ్ భారత్ కు దౌత్యపరమైన నోట్ పంపింది. ఈ నేపథ్యంలోనే షేక్ హసీనా అంశం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతకు కారణమవుతోంది. బంగ్లాదేశ్ సరిహద్దులో కంచెపై భారత్ వైపు నుంచి కూడా ఉద్రిక్తత నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+