సూడాన్‌లోని భారతీయుల తరలింపు కోసం భారత యుద్ధ విమానాలు, నౌకలు రెడీ
న్యూఢిల్లీ: సంక్షోభంలో చిక్కుకున్న సూడాన్ నుంచి భారతీయ పౌరులను తరలించే ప్రక్రియను వేగవంతం చేసింది భారత ప్రభుత్వం. ఇందులో భాగంగా జెడ్డాలో భారత్ రెండు సి-130జె సైనిక రవాణా విమానాలను సిద్ధంగా ఉంచినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. భారత నావికాదళ నౌక ఐఎన్‌ఎస్ సుమేధ కూడా సుడాన్ నౌకాశ్రయానికి చేరుకుందని ప్రకటనలో తెలిపారు.
'రెండు భారతీయ వైమానిక దళం C-130J ప్రస్తుతం జెడ్డాలో సిద్ధంగా ఉంది. ఐఎన్ఎస్ సుమేధ పోర్ట్ సుడాన్‌కు చేరుకుంది' అని విదేశాంగ శాఖ ప్రకటనలో వెల్లడించింది. "ఆకస్మిక ప్రణాళికలు అమలులో ఉన్నాయి, అయితే మైదానంలో ఏదైనా కదలిక భద్రతా పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది, ఇది సుడాన్ రాజధాని ఖార్టూమ్‌లోని వివిధ ప్రదేశాలలో భీకర పోరాటాల నివేదికలతో అస్థిరంగా కొనసాగుతుంది' అని పేర్కొంది.

తరలింపు డ్రైవ్‌పై వివరాలను తెలియజేస్తూ.. భారతీయుల తరలింపు కోసం ఆకస్మిక ప్రణాళికలు రూపొందించబడ్డాయి. అయితే మైదానంలో ఏదైనా కదలిక భద్రతా పరిస్థితిపై ఆధారపడి ఉంటుందని తెలిపింది. సుడాన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల భద్రత, సురక్షితంగా తిరిగి రావడానికి భారతదేశం అన్ని ప్రయత్నాలు చేస్తోందని విదేశాంగశఆఖ పేర్కొంది. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది.
'సూడాన్‌లో చిక్కుకుపోయిన, అక్కడ్నుంచి వెళ్లిపోవాలనుకుంటున్న భారతీయుల సురక్షిత తరలింపు కోసం మేము వివిధ భాగస్వాములతో సన్నిహితంగా సమన్వయం చేస్తున్నాము' ఎంఈఏ వెల్లడించింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం.. దేశ రాజధాని ఖార్టూమ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి భీకర పోరాటాల నివేదికల మధ్య సుడాన్‌లో భద్రతా పరిస్థితి "అస్థిరత" గా కొనసాగుతోంది. నిరంతరాయంగా కొనసాగుతున్న ఘర్షణలు తరలింపునకు విఘాతం కలిగిస్తున్నాయన్నారు.
భారతీయపౌరులను అప్రమత్తం చేస్తున్న కేంద్రం
సుడాన్‌లో పరిస్థితులు దిగజారుతున్నాయి. సైన్యం, పారామిలిటరీ దళాల మధ్య ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. కాల్పులు, బాంబు పేలుళ్లతో సూడాన్ రాజధాని ఖార్తూమ్ సహా పరిసర ప్రాంతాలు కూడా దద్ధరిల్లుతున్నాయి. ఈ నేపథ్యంలో సూడాన్‌లోని భారతీయులను మరోసారి భారత ప్రభుత్వం అప్రమత్తం చేసింది. సూడాన్‌లోని భారత రాయబార కార్యాలయానికి ఎవరూ వెళ్లొద్దని కేంద్ర ప్రభుత్వం సూచనలు చేసింది.
ఖార్తూమ్ విమానాశ్రయ పరిసరాల్లో ఘర్షణలతో కల్లోల పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో దానికి సమీపంలోనే ఉన్న భారత దౌత్య కార్యాలయంలో ప్రస్తుతం సిబ్బంది ఎవరూ లేరని తెలిపింది. అయితే, రాయబార కార్యాలయం తెరిచే ఉందని.. సిబ్బంది మాత్రం వేర్వేరు చోట్ల నుంచి విధులు నిర్వర్తిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ వివరించారు.
Situation in Sudan
— Arindam Bagchi (@MEAIndia) April 23, 2023
Press Release ➡️ https://t.co/0qLd7zcQLG pic.twitter.com/T9ITIEeYqV
ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా సురక్షితంగా ఉండాలో సూడాన్‌లోని భారతీయులకు సూచిస్తున్నాం. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. అక్కడి భారత రాయబార కార్యాలయం పనిచేస్తోంది. అయితే, ఆ ప్రాంతంలో తీవ్ర ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో.. ఎవరూ అక్కడికి వెళ్లొద్దని సూచించాం. ప్రస్తుత దౌత్య కార్యాలయంలో సిబ్బంది కూడా ఎవరూ లేరు. వారంతా ఇతర ప్రాంతాల నుంచి సేవలు అందిస్తున్నారని అరిందమ్ బాగ్చి పేర్కొన్నారు.
భారతీయుల భద్రతే తమ ప్రాధాన్య అంశమని ఆయన స్పస్టం చేశారు. మరోవైపు, సూడాన్‌లో చోటు చేసుకుంటున్న ఘర్షణ వాతావరణంపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్.. ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెరస్‌ను కలిసి చర్చించారు. జైశంకర్ ప్రస్తుతం న్యూయార్క్‌లోనే ఉన్నారు. సూడాన్‌లో శాంతిభద్రతలు నెలకొనేలా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.
కాగా, సుడాన్‌లోని భారతీయులు దాదాపు 4,000 మంది ఉన్నారు. వీరిలో 1,200 మంది దశాబ్దాల క్రితం అక్కడ స్థిరపడ్డారు. అక్టోబరు 2021లో జరిగిన తిరుగుబాటులో సూడానీస్ మిలటరీ అధికారాన్ని స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి దేశాన్ని సార్వభౌమ మండలి ద్వారా నడిపించింది. సూడాన్ నియంత్రణపై ఆ దేశ సైన్యం, శక్తివంతమైన పారామిలటరీ దళం మధ్య పోరు కొనసాగుతోంది. ఈ పోరాటంలో గత కొద్ది రోజుల్లో 300 మందికిపైగా సామాన్యులు చనిపోయారు. అదే సమయంలో, 2,000 మందికిపైగా గాయపడ్డారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications