ఐరాస భద్రతా మండలిలో భారత్.. దాదాపుగా ఖరారైన విజయం.. తాత్కాలిక కోటాలో రెండేళ్లకు..

ప్రపంచ దేశాలన్నీ ప్రతిష్టాత్మకంగా భావించే భద్రతా మండలిలో భారత్ సభ్యురాలయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్ఎస్సీ‌)లో రెండేళ్ల కాలానికిగానూ ఐదు నాన్ ప్మనెంట్( తాత్కాలిక) సభ్యత్వ స్థానాలకు బుధవారం ఎన్నిక జరుగనుంది. ఆసియా పసిఫిక్ స్థానానికి ఏకైక పోటీదారుగా భారత్ ఒక్కటే నిలవడంతో విజయం దాదాపు ఖరారైనట్లే.

ఆసియా పసిఫిక్ గ్రూపులో చైనా, పాకిస్తాన్ సహా 55 సభ్యదేశాలు ఉండగా, ఒక్క పాక్ తప్ప మితా దేశాలన్నీ ఇండియాకు మద్దతు పలికాయి. కాగా, మనకు సెక్యూరిటీ కౌన్సిల్ లో స్థానం దక్కడంపై దాయాది పాకిస్తాన్ అక్కసు వెళ్లగక్కింది. పాక్ విదేశాంగ మంత్రి షా మొహమ్మద్ ఖురేషి మాట్లాడుతూ.. భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యత్వం పొందాలన్న భారత్ ఉద్దేశం పాకిస్థాన్‌కు ఆందోళన కలిగించే విషయమన్నారు. కాశ్మీర్ సహా పాక్ లేవనెత్తే అనేక కీలక సమస్యలను భారత్ అడ్డుకుంటుంది కాబట్టి ఆ దేశానికి సభ్యత్వం దక్కడంపై తాము విచారం వ్యక్తం చేస్తున్నామన్నారు.

Recommended Video

    North Korea to Cut All Communications with South Korea
    India set to win as UN Security Councils non-permanent member

    ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ హాలులో రహస్య బ్యాలెట్ ద్వారా బుధవారం రాత్రి ఓట్ల ప్రక్రియ నిర్వహిస్తారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో మొత్తం 15 దేశాలు ఉన్నాయి. వీటిలో అమెరికా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్, చైనా శాశ్వత సభ్య దేశాలు కాగా, మిగతా 10 దేశాలు తాత్కాలిక హోదాతో సభ్యత్వం పొందుతాయి. వీటిలో బెల్జియం, కోట్ డి ఐవోర్, డొమినికన్ రిపబ్లిక్, గినియా, జర్మనీ, ఇండోనేషియా, కువైట్, పెరూ, పోలాండ్, దక్షిణాఫ్రికా, ఇండియా ఉన్నాయి. తాత్కాలిక సభ్య దేశాల పదవీకాలం రెండేళ్లు ఉంటుంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+