పాకిస్థాన్‌ కు బిగ్ షాక్.. రంగంలోకి 26 రాఫెల్-M ఫైటర్ జెట్లు

జమ్ముకశ్మీర్ పహల్గాం ఉగ్రదాడి ఘటనపై దేశవ్యాప్తంగా ప్రజలు ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ ను దెబ్బకు దెబ్బ తీయాలన్న కసితో భారత్ ఉంది. సరిహద్దుల్లో పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంది. యుద్ధం ఏ క్షణమైనా మొదలయ్యే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టంగా మారింది. అటు ప్రధాని మోదీ ఇటీవల మాట్లాడుతూ ఉగ్రవాదులను మట్టిలో కలిపేస్తామని శపథం చేశారు. ఇక పాకిస్థాన్ పై రివెంజ్ తీసుకోవాలని సోషల్ మీడియాలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో భారత్ సంచలన నిర్ణయం తీసుకుంది.

సరిహద్దు వెంబడి భారత్- పాకిస్థాన్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్.. పాకిస్థాన్ కు బిగ్ షాక్ ఇచ్చింది. అత్యాధునికమైన 26 రాఫెల్-M ఫైటర్ జెట్ల కొనుగోలుకు భారత్, ఫ్రాన్స్ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ మేరకు రాఫెల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయడానికి భారత్ రూ.63,000 కోట్లకు డీల్ చేసుకుంది. వీటిని వీలైనంత త్వరగా భారత్ కు పంపించాలని ఫ్రాన్ ను ప్రధాని మోదీ కోరారు. ఈ ఒప్పందంతో పాకిస్థాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

ఈ రాఫెల్ ఫైటర్ జెట్లు కేవలం ఫ్రెంచ్ ఆర్మీ వద్ద మాత్రమే ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యాధునిక ఫైటర్ జెట్స్ గా వీటికి పేరుంది. ఈ మేరకు మొత్తం 26 ఫైటర్ జెట్స్ భారత్ ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయనుంది. వీటిలో 22 సింగిల్ సీటర్ కాగా మరో నాలుగు ట్విన్ సీటర్ కెపాసిటీ ఉన్న ఫైటర్ జెట్స్. ఇవి 2031లోపు భారత్ కు అందజేసే యోచనలో ఫ్రాన్స్ ప్రభుత్వం ఉంది. అంటే మరో నాలుగేళ్లలో భారత అమ్ముల పొదిలోకి ఈ వరల్డ్ క్లాస్ ఫైటర్ జెట్స్ చేరతాయని భావించవచ్చు.

డిజైన్, ల్యాండింగ్, వేగం, కచ్చితత్వం పరంగా ప్రపంచంలోనే శక్తివంతమైన జెట్స్ గా వీటికి పేరుంది. ఇవి ప్రస్తుతం ఫ్రాన్స్ మాత్రమే అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే భారత్ వద్ద 36 రాఫెల్ జెట్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఒప్పందం చేసుకున్నవి అత్యంత అధునాతనమైనవిగా నిపుణులు భావిస్తున్నారు. ఇప్పుడు కొనుగోలు చేసే ఈ విమానాలను మిగ్-29 కే విమానాల స్థానంలో పెట్టనున్నారు. ఈ మేరకు ఇదే విషయంపై ఇరు దేశాల అధికారులు ఒప్పందంపై సంతకాలు చేశారు. 2031 నాటికి ఈ ఫైటర్ జెట్స్ భారత ఆర్మీలో ప్రవేశం కానున్నాయి.

India Signs Deal with France for 26 Rafale-M Fighter Jets

మరోవైపు భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల వేళ ప్రధాని నరేంద్ర మోదీతో రాజ్​ నాథ్ సింగ్ కీలక భేటీ నిర్వహించారు. పలు అంశాలపై దాదాపు 40 నిమిషాల పాటు చర్చించారు. ఈ భేటీలో ఆయనతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ఢోబాల్‌ కూడా పాల్గొనడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ఈ సమావేశంలో రాఫేల్ యుద్ధవిమానం కొనుగోలుకు సంబంధించిన విషయాలను రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్.. ప్రధాని మోదీకి వివరించారు. వీలైనంత త్వరగా వీటిని భారత అమ్ముల పొదిలోకి తీసుకొచ్చేందుకు ఫ్రాన్స్ అధికారులతో చర్చలు జరపాలని ప్రధాని మోదీ దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+