FATF గ్రే లిస్టులోకి పాకిస్థాన్..? భారత్ ప్రయత్నం సక్సెస్..?
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ పై భారత్ పలు ఆర్థిక పరమైన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ ను ఆర్థికంగా ఒంటరి చేయాలని భారత్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. అయితే పాకిస్థాన్ మాత్రం ఐఎమ్ఎఫ్, వరల్డ్ బ్యాంక్ ల నుంచి నిధులు తీసుకొచ్చి వివిధ ఉగ్రవాద కార్యకలాపాలకు వాడుకుంటోంది.
అయితే తాజాగా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్(FATF)లో పాకిస్థాన్ ను తిరిగి గ్రే లిస్టులోకి పంపించేందుకు చర్యలను ముమ్మరం చేసింది. ఈ మేరకు భారత్.. వరల్డ్ బ్యాంక్, ఎఫ్ఏటీఎఫ్ సంస్థలతో సమావేశం కానుంది. జూన్ లో సమావేశం జరపనున్నట్లు తెలుస్తోంది. తమకు మరో 20 బిలియన్ డాలర్లు సాయం కావాలని కోరుతూ వరల్డ్ బ్యాంక్ వద్ద పాకిస్థాన్ అర్జీ పెట్టుకుంది. దీంతో పాక్ ను ఆర్థికంగా ఒంటరి చేయాలన్న లక్ష్యాన్ని భారత్ ముమ్మరం చేసింది.
కొద్ది రోజుల క్రితమే పాకిస్థాన్ కు ఐఎంఎఫ్ సంస్థ 2.3 బిలియన్ డాలర్ల ప్యాకేజీని సాయం చేసింది. ఈ చర్యను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ ను ప్రపంచ దేశాలు సాయం మానుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలో పాకిస్థాన్ మరో 20 బిలియన్ డాలర్ల లోన్ కు ప్రయత్నిస్తున్న క్రమంలో భారత్ అలెర్ట్ అయింది. ఈ మేరకు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్(FATF)లో పాకిస్థాన్ ను తిరిగి గ్రే లిస్టులోకి పంపించేందుకు చర్యలను ముమ్మరం చేసింది.

ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్(FATF)లో పాకిస్థాన్ ను గ్రే లిస్టులోకి పంపిస్తే ఆ దేశం ఉగ్రవాద దేశంగా పరిగణిస్తారు. ప్రపంచ దేశాలు, అంతర్జాతీయ సంస్థలు ఆ దేశానికి సాయం చేయడం ఆపివేస్తాయి. ప్రస్తుతం ఈ గ్రే లిస్టులో అల్జీరియా, అంగోలా, కెన్యా, నైజీరియా, నేపాల్, యెమెన్, సిరియా, టాంజానియా,వియత్నాం, వెనీజులా, నమీబియా, లెబనాన్, మొనాకో, కాంగో లాంటి దేశాలు ఉన్నాయి. పాక్ ను ఈ లిస్టులోకి పంపిస్తే.. ప్రపంచంలో ఏకాకిని చేయొచ్చని భారత్ భావిస్తోంది. ఈ మేరకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది.
2018లో పాకిస్థాన్ FATF గ్రే లిస్టులోకి వెళ్లింది. కానీ పలుసార్లు అభ్యర్థనలు, మధ్యవర్తిత్వం, చర్చలు కారణంగా 2022లో FATF గ్రే లిస్టు నుంచి తొలగించింది. అయితే మరోసారి ఆ లిస్టులోకి పాక్ ను పంపించాలని భారత్ యత్నిస్తోంది. ఈ మేరకు వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్, FATF అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications