పాకిస్థాన్ కు సడెన్ షాక్ ఇచ్చిన భారత్..

పాకిస్థాన్ కు చెందిన ఏషియా వన్ అనే మీడియా ఛానల్ కు సంబంధించిన సామాజిక మాధ్యమాల్ని భారత్ బ్లాక్ చేసింది. ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించడంతో పాటు భారత్ లోని సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్న అనుమానంతో ఈ ఛానెల్ పై భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఛానెల్ పాకిస్థాన్ మిలిటరీ భాగస్వామ్యంతో పనిచేస్తున్నట్లు భారత నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. అలాగే ఇంటర్- సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ISI), దాని మీడియా వింగ్ ISPR తో సత్సంబంధాలు కొనసాగిస్తున్నట్లు తేలిన నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

పాకిస్థాన్ మద్దతుతో కొనసాగుతున్న "Asia One" అనే న్యూస్ ఛానెల్ ను వివిధ సామాజిక మాధ్యమాల్లో బ్లాక్ చేసింది భారత్. భారత్ కు వ్యతిరేకంగా రెచ్చగొట్టే పోస్టులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నట్లు భారత నిఘా వర్గాలు తేల్చిన నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఏషియా వన్ ఛానెల్ గతేడాది మే లో పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన తర్వాత ప్రారంభం కావడంతో ఈ ఛానెల్ పై నిఘా పెట్టాయి భారత్ లోని నిఘా వర్గాలు.

పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి ఫేక్ వార్తలను ప్రచారం చేయడానికి ఈ ఛానెల్ ను ఏర్పాటు చేసింది పాకిస్థాన్. ఇటీవల ఈ ఛానెల్ ఎక్స్ వేదికగా పెట్టిన ఓ పోస్టును భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఫ్యాక్ట్ చెక్ చేసి నిజనిజాలను వెల్లడించింది. దీంతో ఈ ఛానెల్ తో భవిష్యత్తులో మరింత ప్రమాదం పొంచి ఉందని భావించిన నిఘా అధికారులు ఈ ఛానెల్ ను భారత్ లో బ్లాక్ చేశాయి.

పాకిస్థాన్ కు చెందిన మొదటి గ్లోబల్ శాటిలైట్ ఇంగ్లీష్ న్యూస్ నెట్ వర్క్ అంటూ ఈ ఛానెల్ ను సామాజిక మాధ్యల్లో ఊదరగొట్టారు. యాంకర్లు, న్యూస్ రీడర్ల కోసం విదేశీయులను నియమించుకున్నారు. అంతర్జాతీయ న్యూస్ ఛానెల్స్ అయిన అల్ జజీరా, టీఆర్ టీ మాదిరి హైలెట్ చేసేందుకు పాకిస్థాన్ యత్నించింది. ఈ ఛానెల్ కు పాకిస్థాన్ మిలిటరీ, ఐఎస్ఐ వర్గాలతో సత్సంబంధాలు ఉన్నాయి. ఈ ఛానెల్ ప్రారంభం నుంచీ భారత్ పై విషం చిమ్ముతూ వస్తోంది.

India Strikes Back Blocks All Social Media Handles of Pakistan s Propaganda Outlet Asia One

ఈ ఛానెల్ పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి నకిలీ వార్తలను నెట్టింట ప్రచారం చేస్తోంది. అలాగే జమ్మూ కాశ్మీర్, సరిహద్దు టెర్రరిజం, దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. అయితే పహల్గామ్ దాడి, ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్థాన్ కు చెందిన డజన్లకొద్దీ న్యూస్ ఛానెల్స్, యూట్యూబ్ ఛానెల్స్ ను భారత్ నిషేధించిన విషయం తెలిసిందే. ఇప్పటికీ వాటిపై నిషేధం కొనసాగుతూనే ఉంది.

మరోవైపు పాకిస్థాన్ లో మీడియారంగం క్షీణిస్తోంది. ఇటీవల పాకిస్థాన్ లోని యాంటీ- టెర్రరిజం కోర్టు డిజిటల్ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్న కారణంగా అనేక మంది జర్నలిస్టులకు డబుల్ యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. 2023లో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ కావడంతో ఆ సమయంలో ఆన్ లైన్ వేదికగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ప్రకటనలు చేసినట్లు తేలడంతో కోర్టు తీర్పు వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+