India Embassy: ఇరాన్ వదిలి వెళ్లిపోండి..! భారతీయులకు ఎంబసీ అలర్ట్..!
ఇరాన్-అమెరికా చర్చలు తుది దశకు చేరుకుంటున్న తరుణంలో వీటిని ఎలాగైనా భగ్నం చేయాలని నిర్ణయించుకున్న ఇజ్రాయెల్ (israel) లెబనాన్ (Lebanon) పై వరుస దాడులకు దిగుతోంది. తాజాగా రాజధాని బీరుట్ సహా లెబనాన్ లోని పలు ప్రాంతాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడులు ఇరాన్ (Iranకు మంటపుట్టించాయి. దీంతో ఇరాన్-లెబనాన్ కలిసి మూకుమ్మడిగా ఇజ్రాయెల్ పై దాడులకు దిగాయి. దీంతో ఇజ్రాయెల్ విలవిల్లాడుతోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ కూడా ప్రతీకార దాడులు ప్రారంభించింది. దీంతో ఇరాన్ వార్ మళ్లీ మొదటికొచ్చేసింది.
ఇరాన్ పై తాజాగా ఇజ్రాయెల్ జరిపిన ప్రతి దాడులతో మళ్లీ యుద్ద వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో భారతీయుల రక్షణకు కేంద్రం (india) చర్యలు ప్రారంభించింది. ఇరాన్ లోని భారత ఎంబసీ అక్కడి భారతీయులకు తక్షణం దేశం విడిచి వెళ్లిపోవాలని సూచించింది. అలాగే భారత్ నుంచి ఎవరూ ఇరాన్ రావొద్దని కూడా సూచించింది. ఇది అక్కడ గత 24 గంటల్లో పెరిగిన ఉద్రిక్తతలకు నిదర్శనంగా కనిపిస్తోంది. ఈ దాడులు, ప్రతిదాడులు మరింత పెరిగితే అమెరికా-ఇరాన్ చర్చలు అటకెక్కడం ఖాయంగా పరిశీలకులు భావిస్తున్నారు.

పశ్చిమాసియా ప్రాంతంలోని తాజా పరిణామాల దృష్ట్యా, భారత పౌరులందరూ ఇరాన్‌కు ఎలాంటి ప్రయాణం చేయవద్దని రాయబార కార్యాలయం గతంలో ఇచ్చిన సలహాను తిరిగి ఇస్తున్నట్లు ఎంబసీ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఇరాన్‌లో ఉన్న భారత పౌరులు కూడా అందుబాటులో ఉన్న రవాణా మార్గాల ద్వారా దేశం విడిచి వెళ్లాలని సూచిసినట్లు తెలిపింది. ఇప్పటికే అక్కడ మారిన పరిస్ధితుల్లో భారతీయుల్ని సురక్షితంగా స్వదేశానికి చేర్చేందుకు ఎంబసీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. యుద్దం ముదిరితే అత్యవసర చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది.














Click it and Unblock the Notifications