ఇజ్రాయెల్ పై విరుచుకుపడుతున్న ఇరాన్

పశ్చిమ ఆసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. లెబనాన్ సహకారంతో ఇజ్రాయెల్ పై విరుచుకుపడుతోంది. రాత్రికి రాత్రి మిస్సైళ్లను సంధించింది. లెబనాన్‌లోని బీరూట్ పై ఇజ్రాయెల్ జరిపిన దాడి అనంతరం పరిస్థితులు అనూహ్యంగా ఉద్రిక్తంగా మారాయి. ఈ రెండు దేశాలు కలిసి టెల్ అవివ్ పై వైమానిక దాడులను చేపట్టాయి.

ఏప్రిల్ ఆరంభంలో కుదిరిన యుద్ధవిరామం తర్వాత, ఇరాన్ నేరుగా ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడులకు దిగడం ఇదే మొదటిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ దాడులను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) ధ్రువీకరించింది కూడా. కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని, దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. అదే సమయంలో తన సైన్యాన్ని సరిహద్దులకు తరలించింది. ఇరాన్ పై దాడులకు దిగింది.

Iran Fires Missiles at Israel for First Time Since April Cease-Fire Beirut Surprise Missile Strikes

ఈ ఘటనలతో రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. ఫలితంగా ఇరు దేశాల మధ్య శాంతి చర్చల ప్రయత్నాలు మరింత క్లిష్టంగా తయారయ్యాయి. టెల్ అవీవ్ సహా ఇజ్రాయెల్ లోని పలు నగరాలు బాంబు మోతలతో దద్దరిల్లాయి. ఇరాన్ సంధించిన డ్రోన్లను ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ ఇంటర్ సెప్ట్ అయ్యాయి. కొన్నింటిని కూల్చివేశాయి. మరికొన్ని లక్ష్యాన్ని తాకాయి. దీంతో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.

లెబనాన్ పై దాడులు చేయడానికి గల కారణాలను సైతం ఐడీఎఫ్ వెల్లడించింది. హిజ్బుల్లా దళాలు ఉత్తర ఇజ్రాయెల్‌పై దాడులు చేయడం వల్లే తాము స్పందించాల్సి వచ్చిందని వివరించింది. అమెరికా మధ్యవర్తిత్వంతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని హిజ్బుల్లా తోసిపుచ్చిన అతికొద్ది రోజులకే ఈ ఘటన చోటుచేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

దక్షిణ బీరూట్‌లోని హిజ్బుల్లా కమాండ్ సెంటర్‌ ను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇదివరకే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ధృవీకరించారు. మరోవైపు, బీరూట్‌పై దాడి పశ్చిమ ఆసియాలో పూర్తి స్థాయి యుద్ధాన్ని ప్రేరేపిస్తుందని ఇరాన్ గట్టిగా హెచ్చరించింది. ఆ వెంటనే ఇజ్రాయెల్ పై మిస్సైళ్లను సంధించింది. అమెరికా, ఇజ్రాయెల్‌లతో జరిగే చర్చల్లో లెబనాన్‌లో సంఘర్షణకు శాశ్వత ముగింపు పలికే నిబంధనలు ఉండాలని టెహ్రాన్ డిమాండ్ చేస్తోంది.

ఈ నేపథ్యంలో, పరిస్థితి చేయి దాటకుండా ఉండేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగారు. ఇరాన్‌పై మరింత సైనిక దాడి చేయవద్దని ఆయన నెతన్యాహును ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇరు దేశాలు ఇప్పటికే దాడులకు పాల్పడ్డాయని, ఇకపై యుద్ధతంత్రాన్ని పెంచవద్దని ఆయన స్పష్టం చేసినట్లు 'ఎక్సియోస్' నివేదించింది. ఏవైనా తదుపరి సైనిక చర్యలు కొనసాగితే, అది అమెరికా, ఇరాన్ మధ్య జరగాల్సిన ఒప్పందాలపై పెను ప్రభావాన్ని చూపుతుందని ట్రంప్ హెచ్చరించారు. ఈ కీలక సమయంలో దౌత్యపరమైన పరిష్కారాల వైపు చూడాలని అమెరికా ఆశిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+