ట్రంప్ డెడ్ లైన్ కు తల ఊపిన భారత్

India US Mini Trade Deal: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. టారిఫ్ లపై మరోసారి తన వైఖరేమిటో వెల్లడించారు. టారిఫ్ పై గతంలో తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. త్వరలోనే కొత్త టారిఫ్ అమలులోకి రాబోతోందనీ తెలిపారు. అనేక దేశాలపై కొత్తగా వడ్డించిన అదనపు వడ్డింపులకు డెడ్ లైన్ విధించారు.

వాణిజ్య భాగస్వామ్య దేశాలన్నీ కూడా ఆగస్టు 1వ తేదీ నుంచి కొత్త టారిఫ్ ను చెల్లించాల్సి ఉంటుందని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయా దేశాలన్నింటికీ లేఖలు పంపించినట్లు చెప్పారు. ఈ నెల 9వ తేదీ నాటికి లేఖల పంపిణీ పూర్తవుతుందని, ఆగస్టు 1వ తేదీ నుంచి కొత్త టారిఫ్ అమలులోకి వస్తుందని అన్నారు.

India-US reportedly agreed for Mini Trade Deal

ఈ పరిస్థితుల మధ్య డొనాల్డ్ ట్రంప్ విధించిన డెడ్ లైన్ కు భారత్ అంగీకరించింది. పూర్తిస్థాయి ట్రేడ్ డీల్ ఇంకా కుదరనప్పటికీ- ఓ మినీ వాణిజ్య ఒప్పందాలకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన భారత కాలమానం ప్రకారం ఈ రాత్రి 10 గంటలకు వెలువడే అవకాశం ఉంది.

అమెరికా విధించే కొత్త టారిఫ్ మెజారిటీ దేశాలకు 10 నుండి 20 శాతం వరకు ఉంటోంది. మరి కొన్ని దేశాలకు చాలా అధికంగా అంటే 60 లేదా 70 శాతం వరకు ఉండబోతోంది. ఈ ఏడాది ఏప్రిల్ లో ట్రంప్ ప్రకటించిన 10 శాతం బేస్ లైన్ నుండి గరిష్టంగా 50 శాతానికి మించి ఈ సుంకాలు ఉండబోతోన్నాయి.

ఏఏ దేశాలకు ఎంత మేర టారిఫ్ ఉండబోతోందనే విషయం ఖరారైంది కూడా. లావోస్- 40, మయన్మార్- 40, థాయ్ లాండ్- 36, కంబోడియా- 36, బంగ్లాదేశ్- 35, సెర్బియా- 35, ఇండోనేషియా- 32, దక్షిణాఫ్రికా- 30, బోస్నియా అండ్ హెర్జెగోనియా- 30, మలేషియా- 25 శాతం మేర టారిఫ్ విధించారు.

వీటితో పాటు ట్యునీషియా- 25, జపాన్- 25, దక్షిణ కొరియా- 25, కజకిస్తాన్- 25 శాతం టారిఫ్ ను ప్రకటించారు. వీటిని కాదని వాణిజ్య భాగస్వామ్య దేశాలు ఏవైనా సరే.. రెసిప్రోకల్ టారిఫ్ ను విధించితే తమ రియాక్షన్ ఘాటుగా ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు. వందశాతానికి పైగా టారిఫ్ విధిస్తామనీ అన్నారు.

జూలై 9వ తేదీ గడువులోగా అమెరికాతో ఒప్పందాలు కుదుర్చుకోని దేశాలపై సుంకాలు గరిష్ఠంగా విధించే అవకాశాలు లేకపోలేదు. ఈ విషయాన్ని ముందు నుంచీ ట్రంప్ చెబుతూనే వస్తోన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 2వ తేదీన రెసిప్రోకల్ టారిఫ్ ను ప్రకటించిన ట్రంప్.. వాటిని అమలు చేయడానికి 90 రోజుల గడువు ఇచ్చారు. ఈ గడువు ఈ నెల 9వ తేదీ నాటికి ముగియబోతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+