ట్రంప్ ప్రమాణ స్వీకారానికి వెళ్లను: ఇండియన్ అమెరికన్ ప్రమీల
డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి తాను హాజరు కాబోనని భారత సంతతికి చెందిన మహిళా ప్రతినిధి ప్రమీల జయపాల్ స్పష్టం చేశారు.
వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి తాను హాజరు కాబోనని భారత సంతతికి చెందిన మహిళా ప్రతినిధి ప్రమీల జయపాల్ స్పష్టం చేశారు. ట్రంప్ వాడిన పదజాలం, చర్యలు అమెరికా ప్రజాస్వామ్యాన్ని, చరిత్రను తక్కువ చేసేలా ఉన్నాయన్నారు.
సియాటెల్ నుంచి ప్రతినిధుల సభకు ఎంపికైన భారతీయ అమెరికన్‌గా రికార్డు సృష్టించారు ప్రమీల. తాను అన్ని రకాలుగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. దాదాపు 24 మంది చట్టసభల ప్రతినిధులు ట్రంప్ ప్రమాణ స్వీకారానికి హాజరు కాబోమని చెప్పారు.

అధ్యక్ష ఎన్నికలు ముగిసిన తర్వాత ట్రంప్ వైఖరిలో మార్పు వస్తుందని ఆశించానని, అందరినీ కలుపుకొని పోతారని చెప్పిన మాటలు నీటిమూటలయ్యాయని, అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టబోయే ముందు కూడా ఆయన తీరు మారటం లేదని ప్రమీల అన్నారు. ఆయన చర్యలు మన చరిత్ర, హీరోలను అప్రతిష్టపాలు చేసేలా ఉన్నాయన్నారు. ప్రజాస్వామ్యానికి నష్టం కలిగించేలా ఉన్నాయన్నారు.












Click it and Unblock the Notifications