అమెరికా సుప్రీంకోర్టు జడ్జీగా శ్రీ శ్రీనివాసన్?
వాషింగ్టన్: అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రవాస భారతీయుడు శ్రీకాంత్ శ్రీ శ్రీనివాసన్ నియమితులయ్యే అవకాశముంది. ప్రస్తుతం ఆయన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ప్రిన్సిపల్ డిప్యూటీ సొలిసిటర్ జనరల్‌గా పనిచేస్తున్నారు.
కాగా, అమెరికా సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఆంటోనిన్ స్కాలియా ఆకస్మిక మరణంతో ఆయన స్థానాన్ని భర్తీ చేసేందుకు తగిన వ్యక్తి కోసం అన్వేషణ మొదలైంది. ఆ అవకాశం ఉన్నవారిలో శ్రీనివాసన్ ప్రథమ స్థానంలో ఉన్నారు.

ఆ రంగంలో ఎంతోమంది నిష్ణాతులను పరిశీలించిన ఒబామా రాజకీయంగా రెండు పార్టీల మద్దతు ఉన్న శ్రీనివాసన్‌ను నామినేట్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. డిఫెన్స్ వివాహ చట్టానికి వ్యతిరేకంగా శ్రీనివాసన్ విజయవంతంగా పోరాడారు.
తమిళనాడులోని తిరునల్వేలికి చెందిన శ్రీనివాసన్ కుటుంబం 1960లోనే అమెరికాలోని టెక్సాస్‌లో స్థిరపడింది. 2013లోనే డిసిలోని కోర్టు ఆఫ్ అప్పీల్‌కు ఎంపికైన తొలి ఆసియన్ అమెరికన్, భారతీయ అమెరికన్‌గా శ్రీనివాసన్ చరిత్ర సృష్టించారు. ఇప్పుడు అమెరికాలో అత్యున్నత న్యాయస్థానంలో జడ్జీగా బాధ్యతలు చేపట్టే అవకాశంలో ముందున్నారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications