మీడియా వ్యూహకర్తకు కీలక పదవి: వాల్ట్ డిస్నీ టు వైట్ హౌస్: గ్రాఫిక్స్ డిజైన్లలో ఎక్స్‌పర్ట్

వాషింగ్టన్: అమెరికాలో అధికార మార్పడికి సన్నాహాలు ఆరంభం అయ్యాయి. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి యూఎస్ కాంగ్రెస్, సెనెట్ సమాయాత్తమౌతోంది. అమెరికా అధ్యక్షుడిగా జో బిడెన్.. ఈ నెల 20వ తేదీన బాధ్యతలను స్వీకరించబోతోన్నారు. దానికి ఒక్కరోజు ముందే ప్రస్తుత అధ్యక్షుడు, అభిశంసనను ఎదుర్కొంటోన్న డొనాల్డ్ ట్రంప్ రాజీనామా చేయనున్నారు. బిడెన్ సారథ్యంలో ఏర్పాటు కాబోయే కొత్త ప్రభుత్వంలో భారతీయులు కీలక పాత్ర పోషించబోతోన్నారు. ఇప్పటికే పలువురు ఇండియన్-అమెరికన్లు బిడెన్ సర్కార్‌లో వేర్వేరు హోదాల్లో నియమితులు అయ్యారు.

తాజాగా అదే జాబితాలో మరో ఇండియన్-అమెరికన్ చేరారు. భారత సంతతికి చెందిన మహిళ.. జో బిడెన్ టీమ్‌లో అపాయింట్ అయ్యారు. ఆమె పేరు గరిమా వర్మ. కాబోయే ప్రథమ మహిళ జిల్ బిడెన్ డిజిటల్ డైరెక్టర్‌గా ఆమె నియమితులు అయ్యారు. ఈ మేరకు జో బిడెన్ కార్యాలయం ఓ లెటర్ విడుదల చేసింది. గరిమా వర్మతో పాటు జిల్ బిడెన్ ఆఫీస్‌లోకి మరొకరిని తీసుకున్నారు. రోరీ బ్రోసియస్‌ను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించారు.

Indian-American media strategist Garima Verma named digital director in Office of the First Lady Jill Biden

గరిమా వర్మ భారత్‌లో జన్మించారు. అనంతరం ఆమె తల్లిదండ్రులో అమెరికా వెళ్లారు. ఓహియోలో స్థిరపడ్డారు. ప్రస్తుతం ఆమె కుటుంబం కాలిఫోర్నియాలోని సెంట్రల్ వ్యాలీలో నివసిస్తోంది. గత ఏడాది ముగిసిన అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఆమె బిడెన్-హ్యారిస్ క్యాంప్‌లో పనిచేశారు. మీడియా స్ట్రాటజిస్ట్‌గా వ్యవహరించారు. రాజకీయాల్లోకి ప్రవేశించడానికి ముందు గరిమా.. పారామౌంట్ పిక్చర్స్‌లో పనిచేశారు. గ్రాఫిక్స్ డివిజన్‌ హెడ్‌గా ఉన్నారు. అనంతరం ఏబీసీ నెట్‌వర్క్‌లో టెలివిజన్ షో హోస్ట్‌గా కనిపించారు. ఈ ఏబీసీ నెట్‌వర్క్.. వాల్ట్ డిస్నీకి చెందిన కంపెనీ. అనంతరం హారిజాన్ మీడియా అనే ఏజెన్సీని నడిపంచారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+