Shamina Singh: బైడెన్ సర్కారులో మరో భారత-అమెరికన్‌కు కీలక పదవి
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వంలో మరో భారతీయ అమెరికన్‌కు కీలక పదవి లభించింది. ప్రముఖ మహిళా పారిశ్రామికవేత్త, మాస్టర్ కార్డ్ సెంటర్ ఫర్ ఇన్‌క్లూజివ్ గ్రోత్ వ్యవస్థాపకురాలు షమీనా సింగ్(Shamina Singh) ఎగుమతుల మండలి(export council) సభ్యురాలిగా బైడెన్ నియమించారు. ఈ మేరకు అమెరికా వైట్ హౌస్ ఓ ప్రకటనలో వెల్లడించింది.
ఎగుమతి మండలిలో షమీనా సింగ్ కీలక బాధ్యతలు చేపట్టనున్నట్లు వైట్ హౌస్ తెలిపింది. తన నియామకంపై షమీనా ఆనందం వ్యక్తం చేశారు. ప్రెసిడెంట్ ఎగుమతుల కమిటీలో చేరడం గర్వంగా ఉందని తెలిపారు. ఈ మండలి.. అమెరికా అంతర్జాతీయ వాణిజ్యానికి ప్రధాన జాతీయ సలహా కమిటీగా ఉంది. వాణిజ్యం, ఎగుమతుల విస్తరణ, వాణిజ్య సంబంధ అంశాలపై ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలకు ఈ మండలి అధ్యక్షుడికి సలహాలు, సూచనలు చేస్తుంది.

షమీనా సింగ్ గతంలో కూడా వైట్ హౌస్, ప్రతినిధుల సభలో కీలక పదవులు నిర్వహించారు. ఆసియాన్, అమెరికన్స్ అండ్ పషిఫిక్ ఐలాండర్స్‌పై మొదటి అధ్యక్ష సలహా కమిషన్‌కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. 2015లో అమెరికార్ప్స్ బోర్డ్ సభ్యురాలిగా అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆమెను నియమించారు.
కాగా, జో బైడెన్ ప్రభుత్వంలో ఇప్పటికే దాదాపు 150కిపైగా మంది భారతీయ అమెరికన్లు కీలక పదవుల్లో ఉన్నారు. తాజాగా, షమీనా సింగ్ కూడా ఈ జాబితాలో చేరారు. గత ప్రభుత్వాల్లో కూడా భారతీయ అమెరికన్లు కీలక బాధ్యతల్లో ఉన్న విషయం తెలిసిందే. అమెరికా ఉపాధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన కమలా హారీస్ ఉన్నారు.












Click it and Unblock the Notifications