అమెరికా కాంగ్రెస్ పోటీలో భారత సంతతి మహిళ శ్రినా కురణి..
భారత సంతతికి చెందిన ఇంజినీర్, పారిశ్రామికవేత్త శ్రినా కురణి అమెరికా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. కాలిఫోర్నియా నుంచి హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కు పోటీ చేయనున్నారు. రివర్‌సైడ్‌లో ఉన్న భారతీయ ఇమ్మిగ్రాంట్ పేరెంట్స్‌కు కురణి జన్మించారు. 2022 నవంబర్‌లో జరగనున్న మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ నేత కెన్ కాల్వర్ట్‌పై ఆమె పోటీ చేస్తారు.
సీఏ-42 స్థానం నుంచి పోటీ చేస్తున్నట్లు శ్రినా కురణి తెలిపారు. కెన్ కాల్వర్ట్ 30 ఏళ్ల నుంచి పదవిలో ఉన్నారని, కానీ ఈ ప్రాంతానికి ఆయన ఏమీ చేయలేదని అంటున్నారు. ఈ సారి కొత్త పంథాలో వెళ్లాలని శ్రినా అన్నారు. లా సిరా హై స్కూల్ నుంచి ఆమె గ్రాడ్యుయేట్ అయ్యారు. యూసీ రివర్‌సైడ్‌లో శ్రినా మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు.

ఆహార వ్యర్ధాల నియంత్రణ గురించి స్టార్టప్ కంపెనీల్లో పనిచేశారు. అమెరికా దిగువ సభలో భారత సంతతికి చెందిన నలుగురు నేతలు ఉన్నారు. డాక్టర్ అమి బెరా, రో ఖన్నా, రాజా కృష్ణమూర్తి, పరిమలా జయపాల్ ఆ జాబితాలో ఉన్నారు. వీరిలో శ్రినా కురణి కలువబోతున్నారు.
కాంగ్రెస్‌కు పోటీ చేసి.. సుపరిపాలన అందిస్తానని శ్రినా కురణి తెలిపారు. వాషింగ్టన్‌ను మంచి డెవలప్ చేస్తానని చెప్పారు. కాలిఫోర్నియాలో ప్రతీ ఒక్కరి ఆరోగ్యం, భద్రత తనకు ముఖ్యం అని చెప్పారు. అలాగే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానని ఆమె వివరించారు. అంతేకాదు కెన్ కల్వర్ట్ తన హయాంలో ఏమీ చేయలేదని ఫైరయ్యారు. ఇక్కడ పోటీ చేసి.. వాషింగ్టన్‌లో ఉంటే ప్రజల బాధలు ఏం తెలుస్తాయని అడిగారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications