అమెరికాలో ఇండియన్ అమెరికా విద్యార్థి మృతి

పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం వార్టన్ స్కూల్ ఇరవై యేళ్ల విద్యార్థి పుల్కీ సింగ్ మృతదేహం గతవారం క్యాంపస్ వెలుపల గల అతని గదిలో పడి ఉందని కాలేజీ న్యూస్ పేపర్ ది దైలీ పెన్సిల్వేనియాను ఉటంకిస్తూ న్యూస్‌డే రాసింది.
మరణానికి గల కారణాలపై ఫిలడెల్ఫియా ఆరోగ్య శాఖ, క్యాంపస్ పోలీసులు దర్యాప్తు చేశారు. నేరానికి సంబంధించి అంశం ఇందులో లేదని భావిస్తున్నారు. నెలల తరబడి మరణానికి గల కారణం కనుక్కోవడం సాధ్యం కాకపోవచ్చునని ఆరోగ్య శాఖ తెలిపింది.
పుల్కీ సింగ్ చాలా తెలివైనవాడని, కాలం కన్నా పది పన్నెండేళ్లు ముందుగా ఆలోచన చేస్తాడని అతని అంకల్ జోగిందర్ సింగ్ చెప్పారు.












Click it and Unblock the Notifications