వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దుబాయ్‌లో అంతే: నెం. ప్లేట్ కోసం 59కోట్లు, దక్కించుకుంది మనోడే!

|
Google Oneindia TeluguNews

దుబాయి: మనదేశంలో తమ కొత్త వాహనాల కోసం తమకు నచ్చిన నెంబర్ కావాలంటూ కొందరు ప్రముఖులు ఒకటి రెండు కోట్లు చెల్లిస్తేనే మనం ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటాం. కానీ ఇక్కడ మాత్రం ఓ వ్యక్తి ఏకంగా 59 కోట్ల రూపాలయలు వెచ్చించాడు. అది కూడా దుబాయ్‌లో. అయితే అంత భారీ మొత్తంతో నెంబర్ ప్లేట్ దక్కించుకున్న అతడు కూడా భారతీయుడే కావడం విశేషం.

వివరాల్లోకి వెళితే.. ఇటీవల జరిగిన ఓ వేలంలో భారత్‌ దేశానికి చెందిన ఓ వ్యాపారవేత్త ఏకంగా దాదాపు 59కోట్లు వెచ్చించాడు. బల్వీందర్‌ సహానీ అనే వ్యాపార వేత్త డి5 అనే నెంబర్‌కు అక్షరాల 9మిలియన్‌ డాలర్లు(రూ.59కోట్లు) వెచ్చించారు.

Indian Buys $9 Million Dubai License Plate for Rolls Royce

ఇదే వ్యాపారవేత్త ఈ ఏడాది మొదట్లో ఒక నెంబర్‌ ప్లేట్‌కు రూ. 1.8కోట్లకు పైగా ఖర్చు చేశారు. నిరుడు 09 నెంబర్‌ప్లేట్‌ కోసం రూ.45కోట్లు ఖర్చు చేశారు.

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో చిన్న నెంబర్‌ ఉండటం హోదాకు చిహ్నం ఇక్కడ 2008లో సయీద్‌ అల్‌ కొహురీ ఒక నెంబర్‌ కోసం అక్షరాల రూ.90కోట్లకు పైగా ఖర్చుపెట్టడం గమనార్హం. అంటే ఇక్కడ నెంబర్ ప్లేట్ల కోసం కోట్లు వెచ్చించడం సాధారణమే అన్నమాట.

English summary
Indian businessman Balwinder Sahani paid 33 million dirhams ($9 million) for a Dubai license plate for one of his Rolls Royces.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X