కత్తితో పొడిచి ప్రేయసిని చంపిన భారత సంతతి వ్యక్తి

Indian charged with killing Singaporean-Indian woman of in Australia
మెల్బోర్న్: సింగపూర్‌లో చదువుకుంటు్న యువతిని 31 ఏళ్ల భారత సంతతి వ్యక్తి హత్య చేశాడు. ఆమె కూడా భారత్ నుంచి వచ్చిందే. ఆస్ట్రేలియాలోని ఓ హోటల్ వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది.

సెంథిల్ కుమార్ ఆర్ముగం మీనా నారాయణన్ (27)ను ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ షాపింగ్ సెంటర్ వద్ద కత్తితో పొడిచి హత్య చేశాడు. వారిద్దరు త్వరలో పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.

నారాయణన్ శరీరంపై గాయాలు చూస్తే అత్యంత దారుణంగా దాడి జరిగినట్లు అర్థమవుతోందని కొరియర్ మెయిల్ గురువారంనాడు వ్యాఖ్యానించింది. హత్య బుధవారంనాడు జరిగింది. హోటల్ సిబ్బంది సమాచరాంతో పోలీసులు వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఆర్ముగం శరీరానికి కూడా గాయాలు కనిపించాయి. అతను స్వయంగా ఆ గాయాలను చేసుకుని ఉంటాడని అనుమానిస్తున్నారు. అతన్ని ఆస్పత్రిలో చేర్చారు. అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు చెబుతున్నారు.

సంఘటనా స్థలం నుంచి పోలీసులు కత్తిని స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో మృతురాలి కుటుంబ సభ్యుల సహకారం తీసుకుంటున్నారు. నారాయణన్ బ్రిస్పేన్‌లోని క్వీన్స్‌ల్యాండ్ సాంకేతిక విశ్వవిద్యాలయంలో చదువుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+