దుర్భేధ్యమైన మంచు పర్వతాన్ని అధిరోహిస్తూ భారతీయుడు అదృశ్యం

ఖాట్మండు: మౌంట్ అన్నపూర్ణ. నేపాల్‌లో ఉంటుందీ పర్వతం. పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది. ప్రపంచంలోని అతి ఎత్తయిన పర్వత శిఖరాల్లో ఇదీ ఒకటి. అతి ఎత్తయిన 10వ పర్వతంగా దీనికి గుర్తింపు ఉంది. సముద్ర మట్టానికి 8,091 మీటర్ల ఎత్తులో ఉంటుంది. దీన్ని అధిరోహించడం అంత సులువు కాదు. ఎప్పటికప్పుడు వాతావరణం మారిపోతుంటుంది.

అలాంటి దుర్భేధ్య పర్వతాన్ని అధిరోహించడానికి వెళ్లిన భారతీయ పర్వతారోహకుడొకరు అదృశ్యం అయ్యారు. 24 గంటలుగా అతని జాడ తెలియరావట్లేదు. ఆ పర్వతారోహకుడి పేరు అనురాగ్ మాలు. వయస్సు 34 సంవత్సరాలు. రాజస్థాన్‌లోని కిషన్‌గఢ్ ఆయన స్వస్థలం. మౌంట్ అన్నపూర్ణను అధిరోహించిన ఆయన కిందికి తిరిగి వస్తూ అదృశ్యం అయ్యారు.

Indian climber Anurag Malu went missing

క్యాంప్ 3 నుంచి దిగుతుండగా కనిపించకుండా పోయారు. సోమవారం ఉదయం నుంచి అనురాగ్ మాలు జాడ కనిపించట్లేదని ట్రెక్కింగ్ నిర్వాహక సంస్థ సెవెన్ సమ్మిట్ ట్రెక్స్ ఛైర్మన్ మింగ్మా షెర్పా తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 8,000 మీటర్లకు పైగా ఎత్తు ఉన్న 14 పర్వత శిఖరాలను అధిరోహించాలనేది అనురాగ్ మాలు లక్ష్యం. ఇందులో భాగంగా ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధిని ఆయా దేశాల్లో ప్రచారం చేస్తోన్నారు.

మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం స్మారకార్థం ఐక్యరాజ్యసమితి స్పాన్సర్ చేస్తోన్న కర్మవీర్ చక్ర అవార్డును కూడా అందుకున్నారు. ఐక్యరాజ్య సమితి సహకారంతో ఇంటర్నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎన్జీఓ ప్రతి సంవత్సరం ఈ అవార్డును అందజేస్తుంటుంది. కొద్దిరోజుల కిందటే సెవెన్ సమ్మిట్ ట్రెక్స్ తరఫున అన్నపూర్ణ పర్వతాన్ని అధిరోహించడానికి నేపాల్‌కు వెళ్లారు. ఈ పర్వత శిఖరానికి చేరుకున్నారు.

అక్కడి నుంచి కిందికి దిగివస్తూ క్యాంప్ 3 నుంచి అదృశ్యం అయ్యారు. సోమవారం ఉదయం నుంచి ఆయన జాడ తెలియరావట్లేదని సెవెన్ సమ్మిట్ ట్రెక్స్ ఛైర్మన్ తెలిపారు. అనురాగ్ మాలు అదృశ్యమైన విషయాన్ని ఛైర్మన్ మింగ్మా షెర్పా నిర్ధారించారు. ఆయన కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు వివరించారు. సాయంత్రం వరకూ అనురాగ్ మాలు జాడ తెలియరాలేదని పేర్కొన్నారు. చీకటి పడటం, వాతావరణం అనుకూలించకపోవడం వల్ల గాలింపు చర్యలను నిలిపివేశామని, ఇవ్వాళ మళ్లీ అన్వేషణ ప్రారంభించినట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+