ఆప్ఘన్‌లో భారత కాన్సులేట్‌పై దాడి, ఉగ్రవాదుల హతం

కాబుల్: ఆఫ్ఘనిస్తాన్‌లోని హెరాత్‌లో గల భారత దౌత్య కార్యాలయం పైన దాడి జరిగింది. ఉగ్రవాదులు ఒక్కసారిగా దౌత్య కార్యాలయంపై కాల్పులు జరిపారు. ఐటిబిపి, ఆఫ్ఘన్ దళాలు ఈ దాడులను సమర్థవంతంగా తిప్పి కొట్టాయి. ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో అప్రమత్తమైన భద్రతా దళాలు ఆ దాడిని తిప్పి కొట్టాయి.

ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య కాల్పులు చాలాసేపు కొనసాగాయి.. దాడి ఘటనను పర్యవేక్షించినట్లు విదేశాంగ శాఖ కార్యదర్శి సుజాతా సింగ్ తెలిపారు.

Indian consulate attacked in Afghanistan's Herat

ఈ దాడి శుక్రవారం జరిగింది. ఈ ఘటనలో అధికారులు ఎవరికీ గాయాలు కాలేదు. తుపాకులతో వచ్చిన ముగ్గురు కాల్పులు జరిపినట్లు పోలీసులు చెప్పారు. ముగ్గురు ఉగ్రవాదుల్లో ఇద్దరిని పోలీసులు మొదట కాల్చి చంపారు. మిగిలిన ఒక్కడు ఆ తర్వాత కాల్పులు జరిపాడు. భారత దౌత్య కార్యాలయంలోనికి అతను చొచ్చుకు రాకుండా భద్రతా దళాలు అతనిని తిప్పి కొట్టాయి. కాసేపటికి మూడో గన్‌మెన్‌ను కూడా కాల్చి చంపాయి. కాగా, ఈ దాడులకు ఏ ఉగ్రవాద సంస్థ కూడా బాధ్యులమని ప్రకటించలేదు.

కాగా, ఆఫ్ఘనిస్తాన్‌లోని హెరాత్‌లో గల భారత దౌత్య కార్యాలయంపై దాడిని కాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఖండించారు. తాను అక్కడి దౌత్యవేత్తలతో మాట్లాడానని మోడీ ట్విట్టర్‌లో స్పందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+