ఘోర పడవ ప్రమాదం: 34 మంది మృతుల్లో భారతీయ జంట, రెండేళ్ల క్రితమే పెళ్లి
న్యూయార్క్/నాగపూర్: అమెరికా కాలిఫోర్నియాలోని శాంతాక్రూజ్ ఐస్‌లాండ్ ప్రాంతంలో సోమవారం జరిగిన పడవ ప్రమాదంలో 34మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ ప్రమాద మృతుల్లో ఓ భారతీయ జంట కూడా ఉన్నట్లు సమాచారం.

నాగపూర్ డాక్టర్ కూతురు, అల్లుడు..
మహారాష్ట్రలోని నాగపూర్‌కు చెందిన పీడియాట్రిషియన్ సతీష్ డియోపుజారి కూతురు, అల్లుడు కూడా ఈ పడవలో ప్రయాణించినట్లు తెలిసింది. ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో ఈ పడవ ప్రమాదానికి గురై సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు పడవ సిబ్బంది తప్ప మిగిలినవారంతా మృతి చెందారు.

రెండేళ్ల క్రితమే వివాహం..
డాక్టర్ డియోపుజారి దగ్గరి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. డియోపుజారి కూతురు, డెంటిస్ట్ అయిన సంజీరి డియోపుజారి రెండేళ్ల క్రితం అమెరికాలో ఓ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్న కౌస్తుభ్ నిర్మల్‌ను వివాహం చేసుకున్నారు. వీరిద్దరు కూడా పెళ్లి తర్వాత అమెరికాలోనే స్థిరపడ్డారు.

అదే పడవలో..
ఈ దంపతుల గురించి ఎలాంటి వార్త కూడా అధికారికంగా రాకపోయినప్పటికీ అదే పడవలో ప్రయాణించడంతో మరణించివుంటారనే భావిస్తున్నారు. డాక్టర్ డియోపుజారి మరో కూతురు కూడా అమెరికాలోనే ఉంటోంది. తన సోదరి గురించిన సమాచారం కోసం అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది.

ఆ ఐదుగురు తప్ప..
మంటలు భారీగా చెలరేగడంతో పడవలోని ఎవరూ కూడా ప్రాణాలతో బయటపడలేదని అక్కడి పోలీసులు తెలిపారు. పడవలో మొత్తం 33మంది ప్రయాణికులు 6గురు పడవ సిబ్బంది ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే పడవపైన ఉన్న ఐదుగురు సిబ్బంది సముద్రంలోకి దూకి చిన్న బోటు సహాయంతో బయటపడ్డారని పోలీసులు తెలిపారు. అగ్ని ప్రమాదం ఎలా చోటు చేసుకుందనే విషయంపై దర్యాప్తు జరుపుతున్నట్లు చెప్పారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications