భారత అక్రమ వలసదారులు మనుషులు కాదు..ఏలియన్లు: అవమానకరంగా మాట్లాడిన యూఎస్ చీఫ్
Indian deportees: అమెరికాలో నివసించే అక్రమ వలసదారులు, వారిని తరలించిన విధానం దేశ రాజకీయాల్లో చిచ్చుపెట్టింది. దీనిపై కాంగ్రెస్ సారథ్యంలోని ప్రతిపక్షాల ఉమ్మడి సంకీర్ణ కూటమి ఇండియా తీవ్ర అభ్యంతరాన్ని తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన వైఖరేంటో తెలియజేయాలంటూ పట్టుబట్టింది. సమగ్ర చర్చ జరగాలంటూ డిమాండ్ చేస్తోంది.
ఈ వ్యవహారంపై చర్చించడానికి ఈ ఉదయమే కాంగ్రెస్ విప్ కేసీ వేణుగోపాల్.. వాయిదా తీర్మానాన్ని సైతం అందజేశారు. దీన్ని స్పీకర్ తోసిపుచ్చారు. కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ.. ఇలా ఇండియా భాగస్వామ్య ఎంపీలందరూ మూకుమ్మడిగా లేచి నిల్చున్నారు.

అక్రమ వసలదారులు, వారి తరలింపు విధానంపై అధికార ఎన్డీఏ తన వైఖరిని తెలియజేయాలంటూ డిమాండ్ చేశారు. దీనితో లోక్‌సభ, రాజ్యసభ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. వారిని వారించడానికి స్పీకర్ ఓం బిర్లా, ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌కర్ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. దీనితో సభను ఈ మధ్యాహ్నానికి వాయిదా వేశారు.
తోటి భారతీయులకు సంకెళ్లు వేసి సైనిక విమానంలో తరలించడం దేశానికి అవమానకరంటూ కేసీ వేణుగోపాల్ ధ్వజమెత్తారు. అమెరికా చర్య- దేశ సార్వభౌమతాన్ని ప్రశ్నించినట్టయిందని వ్యాఖ్యానించారు. దౌత్యపరంగా కేంద్ర ప్రభుత్వం తన నిరసనను తెలియజేయాల్సిన అవసరం ఉందని అన్నారు. వాళ్లేమీ క్రిమినల్స్ కాదని గుర్తు చేశారు. దీనిపై చర్చించడానికీ కేంద్రానికి తీరిక దొరకట్లేదంటూ విమర్శించారు.
ఈ పరిస్థితుల మధ్య అమెరికా ఓ వీడియోను విడుదల చేసింది. ఈ రాజకీయ రచ్చకు మరింత ఆజ్యం పోసేలా ఉందా వీడియో. అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ చీఫ్ మైఖెల్ డబ్ల్యూ బ్యాంక్స్ దీన్ని విడుదల చేశారు. తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.
అమెరికా ఆర్మీకి చెందిన సీ-17 విమానాన్ని ఎక్కుతున్నప్పుడు చిత్రీకరించిన వీడియో ఇది. 24 సెకెండ్ల నిడివి ఉన్న ఈ వీడియో భారత అక్రమవలసదారుల పట్ల ఆ దేశం ఎంత అమానవీయంగా ప్రవర్తించిందనే విషయానికి అద్దం పట్టింది. అక్రమవలస దారుల కాళ్లకు గొలుసులు, చేతులకు బేడీలు వేసి ఉండటం ఇందులో కనిపించింది.
USBP and partners successfully returned illegal aliens to India, marking the farthest deportation flight yet using military transport. This mission underscores our commitment to enforcing immigration laws and ensuring swift removals.
— Chief Michael W. Banks (@USBPChief) February 5, 2025
If you cross illegally, you will be removed. pic.twitter.com/WW4OWYzWOf
ఈ పోస్ట్‌కు కొన్ని కామెంట్స్ జత చేశారు మైఖెల్ డబ్ల్యూ బ్యాంక్స్. దీనితో పాటు ఫ్లైట్ టేకాఫ్ తీసుకున్నప్పుడు కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత అక్రమవలసదారులను గ్రహాంతరవాసులుగా అభివర్ణించారు. ఏ దేశానికి చెందిన వాళ్లయినా సరే- ఇలాగే వ్యవహరిస్తామనీ తేల్చి చెప్పారు. అక్రమంగా దేశంలో జొరబడితే రిమూవ్ చేస్తామనీ హెచ్చరించారు.












Click it and Unblock the Notifications