నన్ను చాలాసార్లు తాకాడు: భారత డాక్టర్‌పై 16 ఏళ్ల బాలిక ఫిర్యాదు, అరెస్టు
లైంగిక వేధింపులకు సంబంధించిన ఆరోపణలతో అమెరికాలో విజకుమార్ కృష్ణప్ప అనే 28 ఏళ్ల భారత డాక్టర్‌ను అమెరికా పోలీసులు అరెస్టు చేశారు.
న్యూయార్క్: లైంగిక వేధింపులకు సంబంధించిన ఆరోపణలతో అమెరికాలో విజకుమార్ కృష్ణప్ప అనే 28 ఏళ్ల భారత డాక్టర్‌ను అమెరికా పోలీసులు అరెస్టు చేశారు.
గత నెల 23న న్యూజెర్సీకి పయనమైన యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమానంలో తాను నిద్రించి ఉండగా పక్క సీట్లో ఉన్న కృష్ణప్ప పలుమార్లు అసభ్యంగా తాకాడని పదహారేళ్ల బాలిక ఆరోపించింది.
విమాన సిబ్బందికి విషయం చెప్పి తన సీటు మార్పించుకున్నట్లు తెలిపింది. ఆమె కుటుంబం ఈ ఘటనపై ఫిర్యాదు చేసింది. అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ కృష్ణప్పపై కేసు నమోదు చేసింది.

మైనర్‌పై లైంగిక వేధింపులకు సంబంధించిన ఆరోపణలతో కృష్ణప్పను అరెస్ట్ చేసినట్లు నెవార్క్ ఫెడరల్ కోర్టు రికార్డులు పేర్కొన్నాయి.
బాండుపై ఆయనను విడుదల చేసి ఎలక్ట్రానిక్ పర్యవేక్షణలో ఉంచినట్లు తెలిపాయి. ఇటు కృష్ణప్ప తరఫు న్యాయవాది ఈ ఆరోపణలను తోసిపుచ్చారు.












Click it and Unblock the Notifications