కారు అద్దెకు: కాంట్రాక్టు రద్దుకు కారణమైన భారత డ్రైవర్లు

న్యూఢిల్లీ: అతివేగం ప్రమాదకరం. వాహనాలు అతివేగంగా నడిపితే పోలీసులు జరిమానా విధించే సంగతి తెలిసిందే. అయితే, న్యూజిలాండ్‌లో కారుని నెమ్మెదిగా నడిపి కారు అద్దెకిచ్చిన సంస్ధ కాంట్రాక్టును రద్దు అయ్యేందుకు ఇద్దరు భారతీయ టూరిస్ట్‌లు కారణమయ్యారు.

న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన ఇద్దరు భారతీయులు దక్షిణ ఐస్లాండ్‌లోని క్వీన్స్ టౌన్‌లో రెండు కార్లను అద్దెకు తీసుకున్నారు. అనంతరం అక్కడ గంటకు 100కిలోమీటర్ల వేగంతో వెళ్లాల్సిన చోట 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించారు.

అంతేకాదు రహదారిపై చాలా చోట్ల కార్లను ఆపివేశారు. ఇది వెనకు వస్తున్న వాహనదారులకు ఇబ్బందిగా మారడంతో న్యూజిలాండ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఇద్దరు భారతీయులు నడుపుతున్న కార్లను క్వీన్స్ టౌన్-వానకా ఆపివేసి జీపీఎస్‌ను తనిఖీ చేశారు.

Indian drivers have rental car contracts cancelled in NZ

ఇంతటితో ఆగకుండా, అద్దెకు తీసుకున్న కార్ల సంస్ధ కాంట్రాక్టును రద్దు చేశామని... ఆ ఇద్దరు భారతీయలకు న్యూజిలాండ్ రహదారి నియమాలు తెలియవక పోవడం ఇలా ప్రవర్తించారని సీనియర్ సర్జెంట్ పాలా ఎనోకా తెలిపారు.

ఈ విషయంపై ఇద్దరు భారతీయులు మాత్రం తమకు అక్కడి నియమాలు తెలియవని, అంతేకాకుండా మంచు ఎక్కువగా కురుస్తుండటంతో దారి వెతుక్కోవడం కష్టమైందని అందుకే నెమ్మదిగా ప్రయాణించామని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+