జాక్‌పాట్:లాటరీలో రూ.21.2 కోట్లు దక్కించుకొన్న ఇండియన్

దుబాయ్: దుబాయ్‌లో పనిచేస్తున్న కేరళ రాష్ట్రానికి చెందిన జాన్ వర్గీస్ అనే వ్యక్తికి జాక్ పాట్ తగిలింది. ఓ లాటరీలో జాన్ వర్గీస్‌కు రూ21.2 కోట్ల నగదు దక్కింది. లాటరీలో ఇంత పెద్ద మొత్తంలో తనకు నగదు రావడం పట్ల ఆయన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు.

2016 లో దుబాయ్‌కు వెళ్ళిన జాన్ అక్కడే ఓ ప్రైవేట్ సంస్థలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల కాలంలో జాన్ ఓ లాటరీ టిక్కెట్టును కొన్నాడు.ఈ టిక్కెట్టు రూ. 21.2 కోట్ల నగదును గెలుచుకొన్నారు.

Indian In Dubai Hits Jackpot, Wins Rs. 21 Crore Lottery

లాటరీలో రూ.21.2 కోట్లు గెలుచుకొన్నట్టుగా ఫోన్ రావడంతో తాను నమ్మలేదని జాన్ చెబుతున్నాడు. అయితే ఈ విషయాన్ని ధృవీకరించుకొన్నాక తన ఆనందానికి అవధుల్లేవని ఆయన చెప్పారు.

లాటరీ ద్వారా గెలుచుకొన్న డబ్బుతో భవిష్యత్ అవసరాలకు కొంత దాచుకొంటానని ఆయన చెప్పారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకొనేందుకు తాను కొంత డబ్బును ఖర్చు చేస్తానని జాన్ చెప్పాడు. దుబాయ్‌లో లాటరీల్లో ఇటీవల భారతీయులు ఎక్కువగా డబ్బులు గెలుచుకొంటున్నారు.

ఈ ఏడాది ప్రారంభంలో కూడ కేరళకు చెందిన ఓ వ్యక్తి లాటరీలో భారీ మొత్తాన్ని గెలుచుకొన్నాడు. గత ఏడాదిలో అక్టోబర్ లో అబుధాబీలో నిర్వహించిన లాటరీలో పది మంది రూ.1.7 కోట్లను దక్కించుకొన్నారు. ఇందులో ఎనిమిది మంది భారతీయులే ఉన్నారు. అంతకుముందు ఆగష్టులో కూడ ఇదే తరహలో ఓ ఇండియన్ రూ. 8.8 కోట్లను లాటరీలో గెలుచుకొన్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+