ఇజ్రాయెల్‌లోని భారతీయులకు ఇండియన్ ఎంబసీ తాజా అడ్వైజరీ
ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఆయా దేశాలకు పలు విమానయాన సంస్థలు తమ సర్వీసులను రద్దు చేసిన విషయం తెలిసిందే. హమాస్ అగ్రనేతల మరణాలతో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నందన ఇజ్రాయెల్‌లో ఉన్న భారతీయ పౌరులకు మన దేశ రాయబార కార్యాలయం తాజాగా అడ్వైజరీ జారీ చేసింది. అప్రమత్తంగా ఉంటూ భద్రతా నియమాలను పాటించాలని సూచించింది.
భారత పౌరుల ప్రయాణాలకు సంబంధించి లెబనాన్‌లోని భారత రాయబార కార్యాలయం అడ్వైజరీ జారీ చేసిన మరుసటి రోజు ఇజ్రాయెల్‌లోని కార్యాలయం మన పౌరులను అప్రమత్తం చేసింది. ఇజ్రాయెల్‌లో ఉన్న భారతీయ పౌరులు జాగ్రత్తగా వ్యవహరించిండి. దేశంలో అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండండి. సురక్షిత ప్రదేశాలకు దగ్గర్లో ఉండండి. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని పేర్కొంది.

మనదేశ పౌరుల భద్రతకు సంబంధించి ఇజ్రాయెల్ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తున్నామని ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, కన్నడ భాషల్లోనూ అడ్వైజరీ జారీ చేసింది. అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించాల్సిన నెంబర్లను పోస్టు చేసింది.
📢*IMPORTANT ADVISORY FOR INDIAN NATIONALS IN ISRAEL*
— India in Israel (@indemtel) August 2, 2024
Link : https://t.co/OEsz3oUtBJ pic.twitter.com/COxuF3msn0
కాగా, హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియా గత మంగళవారం ఇరాన్‌లో హత్యకు గురికావడం, హమాస్ సైనిక విభాగాధిపతి మహమ్మద్ డెయిఫ్‌ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ ప్రకటించడం ఈ రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణానికి దారితీసింది. మరోవైపు, లెబనాన్‌లోని హెజ్‌బొల్లా సీనియర్ మిలిటరీ కమాండర్ ఫాద్ షుక్ర్ ఇజ్రాయెల్ జరిపిన దాడిలో మృతి చెందినట్లు తేలింది. ఈ వరుస పరిణామాలతో పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఎయిరిండియా.. ఇజ్రాయెల్ కు విమాన సర్వీసులను నిలిపివేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications