అక్కడ సెల్‌ఫోన్ రింగ్‌టోన్‌గా మన పాటలు నిషేధం
ఢాకా: మొబైల్ ఫోన్ వినియోగదారులు భారతీయ, మరే ఇతర దేశాల పాటలను రింగ్‌టోన్లుగా పెట్టుకోకూడదని బంగ్లాదేశ్‌లోని ఓ న్యాయ స్థానం తీర్పు ఇచ్చింది. తమ దేశంలో ఇతర దేశాలకు సంబంధించిన పాటలెందుకంటూ ఇటీవల కొందరు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.
పిటిషన్‌పై న్యాయ విచారణ జరిపిన కోర్టు, ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఈ విషయమై మొబైల్ ఆపరేటర్లను సైతం తమ వివరణ ఇవ్వాలని కోరింది. విచారణ అనంతరం విదేశీ పాటలను రింగ్‌టోన్లుగా పెట్టుకోవడం నిషిద్ధం అంటూ కోర్టు తీర్పునిచ్చింది.

ఇతర దేశాల పాటలను, సినిమాలను దిగుమతి చేసుకోవడం ఎందుకంటూ కోర్టు ప్రశ్నించింది. మ్యూజిక్ ఇండస్ట్రీస్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏకెఎం అరిఫుర్ రెహ్మాన్, జనరల్ సెక్రటరీ ఎస్‌కె సాహెబ్ అలీలు కోర్టులో వేసిన పిటిషన్ విచారించిన కోర్టు పై విధంగా తీర్పు వెల్లడించింది.












Click it and Unblock the Notifications