ప్రేమించలేదని భారత బాలికను చంపిన పాక్ బాలుడు
దుబాయ్: తన ప్రేమను తిరస్కరించిందన్న కోపంతో ఓ 14 ఏళ్ల భారతీయ బాలికను చంపేశాడో పాకిస్థానీ దుర్మార్గుడు. అతడి వయసు కూడా 14 ఏళ్లే కావడం గమనార్హం. ఈ దారుణం దుబాయ్‌లో చోటు చేసుకుంది. ఆమెను చంపిన తర్వాత అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
స్థానిక మీడియా కథనం ప్రకారం.. బాలిక తల్లి ఉద్యోగం కోసం బయటకు వెళ్లిన సమయంలో ఆ కుర్రాడు బాలిక ఉండే ఫ్లాట్‌కు వెళ్లాడు. తర్వాత వాళ్లిద్దరి మధ్య ఏం గొడవ జరిగిందో మాత్రం స్పష్టంగా తెలియలేదు.
ఆమెను కత్తితో పలుమార్లు పోడిచి చంపేశాడు. ఆ తర్వాత ఆ బాలికపై, తనపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించాడు. దీంతో ఆ ఫ్లాట్ లోని బెడ్రూం మొత్తం కూడా తగలబడిపోయింది.

పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదికలు వచ్చిన తర్వాత ఇద్దరి మృతదేహాలను వాళ్ల బంధువులకు అందిస్తామని పోలీసులు చెప్పారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గదిలో ద్రవ ఇంధనం ఉందని పోలీసులు చెబుతున్నారు.
కాగా, ఆ బాలిక మంచి డాన్సర్ కావాలని అనుకునేదని, ప్రముఖ భారతీయ నృత్యబృందంలో ఆమె సభ్యురాలని తెలుస్తోంది. ఘటన గురించి తెలిసిన బాలిక కుటుంబసభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. కన్నీరుమున్నీరుగా విలపించారు.












Click it and Unblock the Notifications