నన్ను ఉరితీస్తే.., నాది ఇంగ్లాండ్.. పారిపోవడం ఎక్కడిది?: విజయ్ మాల్యా

Recommended Video

    నేను పారిపోవడం అనే కాన్సెప్ట్ ఎక్కడిది: మాల్యా

    న్యూఢిల్లీ/లండన్: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓట్ల కోసం తనను వాడుకోవాలని ఎన్డీయే చూస్తోందని బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి లండన్‌లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యా ఆరోపించారు. శిలువపై ఉరి తీస్తే ఓట్లు రాలుతాయని భావిస్తోందన్నారు. రాజకీయ అవసరాల కోసం భారత ప్రభుత్వం తనను వెంటాడుతోందన్నారు.

    మాల్యాను ఆర్థిక నేరస్థుడిగా ప్రకటించిన భారత ప్రభుత్వం ఆయనను తమకు అప్పగించాలని బ్రిటన్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తోంది. ఇటీవల ఆయన ఆస్తులను సీజ్ చేయాలని కూడా లండన్ కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో మాల్యాపై ఒత్తిడి పెరిగింది. దీంతో కేంద్రంపై ఆయన విమర్శలు చేస్తున్నారు. అంతేకాదు, కాంగ్రెస్ హయాంలో డబ్బులు రుణాలు తీసుకున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాల్యా.. ఇటీవల రాహుల్ గాంధీ చేసిన ట్వీట్‌ను కూడా రీట్వీట్ చేశాడు.

     మాల్యాకు వరుసగా షాకులు

    మాల్యాకు వరుసగా షాకులు

    విజయ్ మాల్యాను ఆర్థిక నేరగాడిగా ప్రకటించిన భారత ప్రభుత్వం... ఆయనను తమకు అప్పగించాలంటూ బ్రిటన్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్న సంగతి తెలిసిందే. బ్రిటన్ లో ఉన్న మాల్యా ఆస్తులను జప్తు చేయాలని కూడా కోరుతోంది. ఈ నేపథ్యంలో మాల్టా మాట్లాడారు. ఎప్పుడో తన తండ్రి తనకు రాసిచ్చిన ఆస్తులను కూడా తీసేసుకుంటున్నారన్నారు. శ్రమ తీసుకుని తమరు తన వద్దకు రావడమెందుకని, తానే వచ్చి ఆస్తులను అందజేస్తానని బ్రిటీష్ ఈడీ అధికారులకు తాను చెప్పానన్నారు.

    వ్యూహాత్మకంగా ఆస్తులు ఇతరుల పేరు మీద

    వ్యూహాత్మకంగా ఆస్తులు ఇతరుల పేరు మీద

    బ్యాంకులకు చెల్లించాల్సిన బకాయిల నిమిత్తం రూ.13,900 కోట్ల విలువైన తన ఆస్తులను తాకట్టు పెట్టానని, బ్యాంకులతో ఉన్న లావాదేవీలన్నింటినీ పూర్తి చేస్తానని మాల్యా చెప్పారు. లండన్ శివార్లలో నాలుగు ఇళ్లు మాల్యా పిల్లల పేరిట ఉన్నాయి. దీనికి తోడు, అత్యంత విలాసవంతమైన ఓ భవనం తల్లి పేరిట ఉంది. ఇదంతా వ్యూహాత్మకంగానే చేసినట్టు భావిస్తున్నారు.

    1920లో మా నాన్న ఆస్తులు రాసిచ్చారు

    1920లో మా నాన్న ఆస్తులు రాసిచ్చారు

    లండన్‌లో తన ఆస్తుల స్వాధీనానికి బ్రిటిష్ కోర్టు ఆదేశాలు ఇచ్చిందని, ఎప్పుడో 1920లలోనే మా నాన్న తనకు రాసిచ్చిన ఆస్తులు తీసుకుంటున్నారని మాల్యా అన్నారు. ఇంట్లో ఉన్న కొద్దిపాటి నగలు, కార్లు జఫ్తు చేస్తారన్నారు. నా లావాదేవీలన్నింటిని సెటిల్ చేస్తానని చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

    నేను పారిపోవడం అనే కాన్సెప్ట్ ఎక్కడిది

    నేను పారిపోవడం అనే కాన్సెప్ట్ ఎక్కడిది

    నేను ఇంగ్లాండ్ రెసిడెంట్‌ను అని, ఇండియా నాన్ రెసిడెంట్‌ను అని విజయ్ మాల్యా చెప్పారు. కాబట్టి నేను ఎక్కడికి తిరిగి వచ్చానో చెప్పాలని ఎదురు ప్రశ్నించారు. నేను లండన్ వాసిని అయినప్పుడు ఇక పారిపోవడం అనే కాన్సెప్ట్ ఎక్కడిది అని ప్రశ్నించారు. బ్యాంకుల నుంచి వేల కోట్లు కొట్టేసి మాల్యా పారిపోయారని విమర్శిస్తున్న నేపథ్యంలో ఆయన పైవిధంగా స్పందించాడు

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+