దోపిడీని అడ్డుకున్న భారతీయుడి దారుణ హత్య
ఒమన్: దొంగతనం చేయడానికి వచ్చిన దుండగులను అడ్డుకున్నందుకు ఓ భారతీయుడిని దారుణంగా చంపేశారు. ఒమన్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కేరళకు చెందిన జాన్ ఫిలిప్ 13ఏళ్ల క్రితం ఒమన్ వెళ్లారు. అక్కడ ఓ పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్నాడు. గత వారం రోజులుగా ఫిలిప్ కనిపించకపోవడంతో సహ ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ క్రమంలో పోలీసులు గాలింపు చేపట్టగా.. రాయల్ ఒమన్ స్టేషన్ పరిధిలో రక్తపుమడుగులో ఉన్న ఫిలిప్ మృతదేహాన్ని గుర్తించారు. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఫిలిప్ పనిచేసే పెట్రోల్‌బంక్‌లో రూ.6.5లక్షల నగదు చోరీ జరిగిందని.. చోరీని అడ్డుకునే క్రమంలోనే దుండగులు హత్య చేశారని పోలీసుల విచారణలో తేలింది. ఘటనకు కారణమైన ఆరుగురు దుండగులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు












Click it and Unblock the Notifications