సౌదీలో కత్తితో పొడిచి హైదరాబాదీ మేల్ నర్స్ హత్య

హుస్సేన్ సయీద్ అనే హైదరాబాదీ సోమవారం హత్యకు గురయ్యాడు. తూర్పు ప్రొవిన్స్‌లోని డమ్మమ్ నగరంలోని ముబారికియా ప్రాంతంలో నివసిస్తున్న ఓ సౌదీ కుటుంబం వద్ద అతను పనిచేస్తున్నాడు. హత్య చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు అరబ్ న్యూస్ రాసింది.
ఇంటి ఆవరణలో శవం పడి ఉందని డమ్మమ్ పోలీసు కంట్రోల్ రూంకు సోమవారం ఐదు గంటలకు సమాచారం అందిందని, గస్తీ పోలీసులు వెంటనే అక్కడికి వెళ్లారని కల్నల్ జియాద్ అల్ రుఖైతీ చెప్పారు.
శవం ఎడమ ఛాతీపై తీవ్రమైన గాయాలున్నాయని, మెయిడ్ పదునైన వస్తువుతో పొడిచినట్లు తెలుస్తోందని అంటున్నారు. మెయిడ్‌ను అరెస్టు చేసి, విచారించినట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications