అమెరికాలో కాల్పులు: కాపుకాసి తెలంగాణ వ్యక్తిని కాల్చిన 16 ఏళ్ల బాలుడు, మృతి

మెదక్/న్యూజెర్సీ: అమెరికాలోని న్యూజెర్సీలో తెలంగాణకు చెందిన వ్యక్తి హత్యకు గురయ్యాడు. వెంట్నార్ సిటీలో నివసిస్తున్న మెదక్‌కు చెందిన సునీల్ ఎడ్లాను అతని ఇంటి ముందు గురువారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో 16 ఏళ్ల బాలుడు తుపాకీతో కాల్చి చంపేశాడు.

ఆఫీసు అయ్యాక సునీల్ ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో బాలుడు అతనిపై కాల్పులు జరిపాడు. ఆ బాలుడు సునీల్ వచ్చే వరకు వేచి చూసి, రాగానే కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. సునీల్ వయస్సు 61. కాల్పుల అనంతరం సునీల్‌ కారును తీసుకొని అతను పారిపోయాడు.

Indian Man, Shot Dead In US, Was Planning Trip Home For Mothers Birthday

సునీల్ తన తల్లి 95వ పుట్టిన రోజు వేడుకల కోసం మెదక్‌లోని సొంత ఇంటికి వచ్చేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఈ దారుణం చోటు చేసుకుంది. సునీల్‌ తలపై కాల్చడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సునీల్ కారులో ఉన్న ట్రాకింగ్‌ సిస్టమ్‌ ద్వారా జాడ తెలుసుకుని బాలుడిని అరెస్ట్ చేశారు.

సునీల్‌ను ఎందుకు హత్య చేశారనే విషయం తెలియరాలేదు. పోలీసులు కాల్పులు జరిపిన బాలుడిని విచారిస్తున్నారు. మైనర్‌ కావడంతో అతడి పేరును బయటకు రానీయడం లేదు. సునీల్ 25 ఏళ్లుగా అక్కడే ఉంటున్నారు. సునీల్‌కు మెదక్, పశ్చిమ గోదావరి జిల్లాలలో బంధువులు ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+