దుబాయ్ లో ప్రేయసిని చంపేసిన భారతీయుడు

దుబాయ్: జీవితంపై విరక్తి పెంచుకున్న ఓ యువకుడు ప్రియురాలిని దారుణంగా హత్య చేసి తరువాత ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన దుబాయ్ లో జరిగింది. అయితే అతనిని ప్రాణాలతో పట్టుకుని విచారిస్తున్నారు.

గల్ఫ్ అంతరంగిక మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. భారతదేశానికి చెందిన ఒక యువకుడు, యువతి ప్రేమించుకున్నారు. అయితే ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. ఆమె మీద అతను కక్ష పెంచుకున్నాడు.

ఇటివల అతను అబుదాబిలోని ఓ హోటల్ లో తన ప్రియురాలిపై కత్తితో పలు సార్లు దాడి చేశాడు. ఆమెను దారుణంగా హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని హోటల్ సమీపంలో విసిరేశాడు. తరువాత వెళ్లి సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు.

Indian man stabs lover to death in Abu Dhabi in UAE

అయితే తీర పరిరక్షణ దళాలు అతనిని కాపాడాయని అధికారులు అన్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతనిని విచారణ చేస్తున్నామని అధికారులు చెప్పారు. హత్య చేసిన వ్యక్తి పేరు ఎంఏ, హత్యకు గురైన అతని ప్రియురాలి పేరు కేకే అని మాత్రం వెళ్లడించారు.

హతురాలి పూర్తి వివరాలు ఇప్పటి వరకు వెలుగు చూడలేదని గల్ఫ్ న్యూస్ తెలిపింది. కేసు క్రైం బ్రాంచ్ అధికారులకు అప్పగించామని అబుదాబి కమాండర్ రషీద్ మహమ్మద్ బర్షీద్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+