చైల్డ్ ఫోర్నోగ్రఫీ: అమెరికాలో భారతీయ యువకుడికి 52 నెలల జైలు శిక్ష
న్యూయార్క్: ఫోర్నోగ్రఫీ కలిగి ఉన్నాడన్న ఆరోపణలపై ఓ భారత సంతతికి చెందిన యువకుడికి అమెరికా కోర్టు నాలుగేళ్లకు పైగా జైలు శిక్ష విధించింది. విడులైన తర్వాత మరో పదేళ్ల పాటు అతడిపై పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. పిట్స్‌బర్గ్‌కు చెందిన అభిజిత్ వద్ద చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన నీలి చిత్రాలు ఉన్నాయని వెల్లడైంది.
అభిజిత్‌కు ఫెడరల్ కోర్టు 52 నెలల జైలు శిక్ష విధించింది. విచారణ అధికారులు కోర్టుకు సమర్పించిన వివరాల మేరకు అభిజిత్ వద్ద 1000 చైల్డ్ పోర్నోగ్రఫీ ఫోటోగ్రాఫ్‌లు, 380 చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలు ఉన్నాయి.

అభిజిత్ ఒక మైనర్ బాలికతో చిత్రీకరించిన అసభ్య చిత్రాలు కలిగి ఉన్నాడు. దీంతో పాటు కంప్యూటర్ గ్రాఫిక్‌లతో అశ్లీలంగా చిత్రీకరించిన ఫోటోలు, వీడియోలు ఉన్నాయని కోర్టుకు సమర్పించిన ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications