286 రోజులు అంతరిక్షంలో.. సునితా విలియమ్స్ కు నాసా ఎంత చెల్లించిందో తెలుసా..?

భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్ర కేవలం 8 రోజుల్లోనే పూర్తి కావాల్సి ఉంది. కానీ సాంకేతిక కారణాల వల్ల దాదాపు 9 నెలల పాటు ఆమె అంతరిక్ష కేంద్రంలోనే గడిపారు. 286 రోజుల తర్వాత ఆమె ఎట్టకేలకు భూమ్మీదకు వచ్చారు. తోటి వ్యోమగామి బ్యారీ బుచ్ విల్మోర్‌‌తో కలిసి భూమండలానికి చేరుకున్నారు. అమెరికాలోని ఫ్లోరిడాలో ల్యాండ్ అయ్యారు.

భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారు జామున సరిగ్గా 3:27 నిమిషాలకు స్పేస్ ఎక్స్‌కు చెందిన డ్రాగన్ క్యాప్సుల్ క్రూ- 9.. ఫ్లోరిడాలో గల నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్‌కు చేరుకుంది. అక్కడి నుంచి వారిద్దరినీ టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో నాసాకు చెందిన జాన్సన్ స్పేస్ సెంటర్‌కు తీసుకెళ్లారు. 45 రోజుల పాటు అక్కడే రిహాబిలిటేషన్‌లోనే వీళ్లు గడపనున్నారు.

అయితే దాదాపు 9 నెలలపాటు అంతరిక్షంలోనే గడిపిన సునితా విలియమ్స్, బ్యారీ బుచ్ లకు అమెరికాకు చెందిన అంతరిక్ష సంస్థ నాసా ఎంత వేతనం చెల్లిస్తుందన్న వివరాలను రిటైర్డ్ నాసా ఆస్ట్రోనాట్ క్యాడీ కోల్ మ్యాన్ వివరించారు. నానా ఉద్యోగులు ఫెడరల్ ఉద్యోగులు. అంటే అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగులు. వాళ్లు అంతరిక్షంలో ఉన్నా దాన్ని రెగ్యూలర్ వర్క్ గానే భావిస్తారు.

సంవత్సరానికి వేతనం..

సాధారణంగా వీళ్లకు ప్రతిరోజూ స్టైఫండ్ కింద నాలుగు డాలర్లు అందిస్తారు. అంటే మన కరెన్సీలో రూ. 347 అని అర్థం. వాళ్లు 287 రోజులు అంతరిక్షంలోనే గడిపారు కాబట్టి అదనంగా ఒక్కొక్కరికి 1,148 డాలర్లు వస్తాయి. అంటే రూ. లక్ష అందజేస్తుంది. ప్రస్తుతం ఈ ఇద్దరు వ్యోమగాములు నాసాలో గ్రేడ్-15 కేటగిలో ఉన్నారు. ఫెడరల్ ఉద్యోగుల్లో ఇదే హైయెస్ట్ కేటగిరీ. వీరి వేతనం సంవత్సరానికి రూ. 1.08 కోట్లు నుంచి 1.41 కోట్లు వరకు ఉంటుంది.

Indian-Origin Astronaut Sunita Williams Returns to Earth After 286 Days in Space How Much Did NASA Pay Her

ఇక సునితా విలియమ్స్, బ్యారీ బుచ్ లు 9 నెలలపాటు అంతరిక్షంలోనే గడిపారు కాబట్టి వీరికి సంవత్సరానికి వేతనం రూ. 81 లక్షల నుంచి రూ. 1.05 కోట్లుగా ఉంటుంది. అన్నీ కలిపితే వీరి వేతనం సంవత్సరానికి రూ. 82 లక్షల నుంచి రూ. 1.06 కోట్లు వరకు ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+