అరుదైన గౌరవం: భారత సంతతి వైద్యుడికి 'నైట్‌హుడ్'
న్యూఢిల్లీ: లండన్‌లోని భారత సంతతికి చెందిన హర్పాల్ సింగ్ కుమార్ అనే వైద్యుడికి అరుదైన గౌరవం లభించింది. కేన్సర్ రీసెర్చ్ నిపుణుడిగా ఉన్న హర్పాల్, కేన్సర్ వ్యాధికి చికిత్స, నివారణలో చేసిన సేవలకు గాను క్వీన్ ఎలిజిబెత్ II రాణి అందించే ప్రతిష్టాత్మకమైన 'నైట్ హుడ్' (సర్ బిరుదు) వరించింది.
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని లండన్‌లో ఈ మేరకు జాబితా విడుదల చేశారు. ప్రస్తుతం హర్పాల్ లండన్‌లోని కేన్సర్ రీసెర్చ్ యూకే సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా సేవలందిస్తున్నారు. ప్రతి సంవత్సరం పలువురు ప్రముఖ వ్యక్తులకు ఈ 'నైట్ హుడ్' బిరుదుని అందజేస్తుంటారు.

ఈ ఏడాది కూడా హర్పాల్ సింగ్‌తో పాటు ఫండింగ్ సర్కిల్ కంపెనీ సీఈవో సమీర్ దేశాయ్‌కి ఆర్థిక రంగంలో చేసిన కృషికిగాను 'కమాండర్ ఆఫ్ మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్' బిరుదు ఇవ్వనున్నారు. ఆఫీసర్ ఆఫ్ మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ జాబితాలో కిడ్డికేర్ లిమిటెడ్ నర్సరీస్ మేనేజింగ్ డైరెక్టర్ కలా పటేల్ కూడా ఉన్నారు.
లీసెస్టర్‌లోని హోటల్ మయాంగోకు మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్న అశోక్ అనద్ కట్ ఈ ఏడాది బ్రిటిష్ ఎంపైర్ పతాకాన్ని ఇవ్వనున్నారు.












Click it and Unblock the Notifications