ఆస్పత్రిలో లైంగిక దాడులు: వైద్యుడికి 30 ఏళ్ల జైలు
న్యూయార్క్: మత్తు మందు ఇచ్చి బాలికలకు లైంగిక వేధింపులకు పాల్పడి ఫోటోలు, మొబైలో వీడియోలు తీస్తున్న భారత సంతతికి చెందిన వైద్యుడికి అమెరికా కోర్టు జైలు శిక్ష విధించింది. ఇక ముందు ఇలాంటి పనులు ఎవ్వరూ చెయ్యకూడదని కోర్టు కఠిన నిర్ణయం తీసుకునింది.
అమెరికాలో భారత సంతతికి చెందిన రాకేష్ పన్ను (57) చిన్నపిల్లల వైద్యుడిగా పని చేస్తున్నాడు. ఇతని దగ్గరకు అనారోగ్యంతో ఉన్న పిల్లలను కుటుంబ సభ్యులు తీసుకు వెళ్లేవారు. అయితే రాకేష్ పన్నుకు బాలికలను లైంగికంగా వేధించేవాడు.
చికిత్స కోసం తీసుకు వచ్చిన వారికి తీవ్ర అనారోగ్యంగా ఉందని చెప్పి వారి కుటుంబ సభ్యులను బయట పెట్టి బాలికలను ఓ గదిలోకి తీసుకు వెళుతున్నాడు. తరువాత బాలికలకు మత్తు మందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడేవాడు.

లైంగిక దాడి చేసే సమయంలో ఫోటోలు, మొబైల్ లో వీడియోలు తీసేవాడు. ఓ బాలిక ఇంటికి వెళ్లిన తరువాత ఆసుత్రిలో జరిగిన విషయం కుటుంబ సభ్యులకు చెప్పింది. బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసిన పోలీసులు 2010లో రాకేష్ పన్నును అరెస్టు చేశారు. అతని మీద పోలీసులు పలు సెక్షల కింద కేసులు నమోదు చేశారు. కేసు విచారణలో తాను నేరం చేశానని రాకేష్ పన్ను కోర్టులో అంగీకరించాడు. యూఎస్ కోర్టు అతనికి 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది.












Click it and Unblock the Notifications