డాక్టర్ డెత్!: 36 మంది మృతి, ఎన్నారై డాక్టర్ అరెస్టు
వాషింగ్టన్: భారత్ మూలాలు కలిగిన సైక్రియాటిస్ట్ వైద్యుడు 36 మంది ప్రాణాలు తీశాడనే ఆరోపణలతో అమెరికాలో అరెస్టయ్యాడు. అమెరికా పోలీసులు అరెస్టు చేసిన సదరు వైద్యుడి పేరు నరేంద్రగా తెలుస్తోంది. ఇతను మానసిక వైద్యుడు.
ఆయన దగ్గరకు చికిత్స కోసం వచ్చిన 36 మంది రోగులు మృతి చెందారు. ఇందులో 12 మంది ఆయన సూచించిన ఓవర్ డోస్ కారణంగా మృతి చెందారని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

జార్జియాలోని క్లేటన్‌లో ఉన్న ఆయన ఇల్లు, కార్యాలయాల్లో అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. అనంతరం అతనిని అదుపులోకి తీసుకున్నారు. ఓపియేట్స్, బెన్‌జోడియాజెపైన్ ఔషధాలను కొన్నేళ్లుగా మోతాదుకు మించిన స్థాయిలో రోగులకు నాగేంద్ర సూచిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
ఓ మానసిక వైద్య నిపుణుడిగా ఆయన వృత్తికి సంబంధంలేని నొప్పి నివారణ ఔషధాలు సూచించినట్లు చెబుతున్నారు. దాదాపు నలభై మంది ఫెడెరల్, లోకల్ అధికారులు నాగిరెడ్డి కార్యాలయం, ఆ తర్వాత ఇంటిలో సోదాలు నిర్వహించారు.












Click it and Unblock the Notifications