భారత సంతతి బాలిక వెంటపడి పాక్ యువకుడి అసభ్య ప్రవర్తన

దుబాయి: భారత సంతతికి చెందిన ఓ మైనర్ బాలికపై పాకిస్థాన్‌కు ఓ యువకుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దుబాయిలో చోటు చేసుకున్న ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడైన పాక్ యువకుడిని అరెస్ట్ చేశారు.

ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. బాధిత బాలిక జూన్ 16న ట్యూషన్‌కు వెళ్లింది. ఆ బాలిక లిఫ్టులో ఉండగా డెలివరీ బాయ్‌గా పనిచేసే పాక్ యువకుడు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఏడ్చుకుంటూ ఆ బాలిక ట్యూషన్ టీచర్ వద్దకు వెళ్లింది.

indian origin girl child molested by a pakistani civilian in dubai

కాగా, బాలిక తన ఇంటికి తరచుగా గణితం నేర్చుకునేందుకు వస్తుంటుందని ట్యూషన్ టీచర్ తెలిపారు. జూన్ 16న కూడా కొన్ని పేపర్లు తన ఇంటి వద్దే మర్చిపోయి రావడంతో వాటిని తెచ్చుకునేందుకు బాలిక వెళ్లిందని ఆమె చెప్పారు. అయితే, ఆ బాలిక తిరిగి ఏడ్చుకుంటూ తన వద్దకు వచ్చిందని తెలిపారు.

ఏడ్చుకుంటూ భయంతో కనిపించడంతో ఏమైందని ఆరా తీశానని.. తాను లిఫ్టులో ఉండగా ఓ డెలీవరీ బాయ్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని బాలిక తనతో చెప్పినట్లు టీచర్ వివరించారు. బాధిత బాలిక ప్రైవేటు భాగాలపై చేతులు వేస్తూ.. నిందితుడు ఆమె అడ్రస్ కూడా అడిగాడు.

బాలిక చెప్పిన విషయాలు విన్న టీచర్.. వెంటనే అపార్ట్‌మెంట్ సెక్యూరిటీ గదికి వెళ్లి సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. అతడు ఐదో అంతస్తులో డెలివరీ ఇచ్చేందుకు వెళ్ళాల్సి ఉండగా.. బాలికను గమనించి డెలివరీ ఇవ్వకుండానే ఆమెను అనుసరించి లిఫ్టులోకి వెళ్లినట్లు గుర్తించామని టీచర్ పోలీసులకు తెలిపారు. ఈ నేపథ్యంలో దర్యాప్తు జరిపిన అల్ ఱపా పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేసి జైలు తరలించారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+