లైంగిక వేధింపుల కేసులో భారత సంతతి సన్యాసి

వాషింగ్టన్: అమెరికాలో భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త, హిందూ సన్యాసి ఒకరు లైంగిక వేధింపుల కేసును ఎదుర్కొంటున్నారు. ఏప్రిల్ 2011 నుంచి ఏప్రిల్ 2015 మధ్య కాలంలో ముగ్గురు మహిళలపై లైంగిక దాడికి పాల్పడినట్టు హిందూ సన్యాసిపై ఆరోపణలున్నట్టు లాస్ ఏంజిల్స్ కంట్రీ డిప్యూటీ డిస్ట్రిక్ట్ అటార్నీ మారెన్ డెర్మోడీ పేర్కొన్నారు.

కాలిఫోర్నియాలోని వెస్టిహిల్స్‌లో గోకుల నందా (63) నివసిస్తున్నారు. అదే ప్రాంతంలోని శాంటా క్లారిటాలో అతడిగా ఈస్టర్న్ మెడిసిన్ స్టోర్ ఉంది. వైద్యం కోసం తనవద్దకు వచ్చే మహిళలను అతను లైంగికంగా వేధించేవాడు. ఈ ఆరోపణలతో సోమవారం అతడితో పాటు 13 మందిని కాలిఫోర్నియా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Indian-Origin Man To Be Arraigned On Sexual Assault Charges

హరి ఓం ఇండియా మార్కెట్‌కు యజమాని అయిన నందాను గతేడాది మే 13న పోలీసులు అరెస్ట్ చేశారు. అదే ఏడాది జులైలో లక్ష డాలర్ల పూచీకత్తుపై బెయిల్‌పై విడుదలయ్యాడు. నందాపై మోపిన ఆరోపణలు రుజువైతే అతడికి గరిష్టంగా 19 సంవత్సరాల జైలు శిక్ష పడనుంది.

టోరెన్స్ పోలీసు డిపార్ట్‌మెంట్ ఈ కేసు విచారణలో ఉందని పేర్కొంది. గోకుల నందా ఫేస్‌బుక్ పేజీ ప్రకారం అతడు ఒరిస్సాలోని కలాపతారా ప్రాంతానికి చెందిన వాడిగా గుర్తించారు. వేదాంత ఫారెస్ట్ అకాడమీలని శివానంద ఆశ్రమంలో అతడు విద్యనభ్యసించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+